Revanth Reddy | Supreme court | Telangana | ACB | Cash for vote case, bail, high court

Revanth reddy case hearing will be starts in the afternoon session in the supreme court

Revanth Reddy, Supreme court, Telangana, ACB, Cash for vote case, bail, high court

Revanth Reddy case Hearing will be starts in the afternoon session in the Supreme court. Telangana ACB filed a petetion on Revanth reddy bail judgement in the Supreme court.

సుప్రీంకోర్ట్ లో రేవంత్ కేసు విచారణ ఈ మధ్యాహ్నం

Posted: 07/03/2015 11:03 AM IST
Revanth reddy case hearing will be starts in the afternoon session in the supreme court

ఓటుకు నోటు కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్ట్ బెయిల్ ఇవ్వడంపై తెలంగాణ అడ్వకేట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కీలక దశలో ఉన్నదని, కేసులో దాదాపు రేవంత్ దోషి అనేందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని కాబట్టి రేవంత్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చెయ్యాలని సుప్రీం కోర్ట్ లో పిటిషన్ ఫైలైంది. అయితే చలరల్పల్లి జైల్ నుండి విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, మంత్రు ల మీద విరుచుకుపడ్డారు. సన్నాసులు, దద్దమ్మలు, తాగుబోతులు అంటూ తూర్పారబట్టారు. అయితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినే హెచ్చరిస్తున్నారు అన్న కోణంలో కూడా పిటిషన్ లో వివరించారు. అయితే దానికి సంబందించిన ఆడియో, వీడియో టేపులను కూడా సుప్రీం కోర్ట్ కు సబ్ మిట్ చెయ్యనున్నారు. అయితే సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ నిజానికి ఈ  ఉదయం విచారణకు రావాల్సి ఉండగా రాలేదు.

Also Read: కేసీఆర్‌ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యమన్న రేవంత్‌

సుప్రీంకోర్టు మామూలు కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఈ మధ్యాహ్నానికి విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి మీద వేసిన కేసులో మళ్లీ బెయిల్ ను కొట్టివేస్తుందా లేదా అని ఉత్కంటత కొనసాగుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో దాదాపు నెల రోజుల పాటు కస్టడీని ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి మరోసారి కస్టడికి వెళతారా లేదా బెయిల్ మీద బయటే ఉంటారా అని సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే తెలంగాణ ఏసీబీ తరఫున కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో వాదిస్తారు అనే పుకారు వినిపిస్తోంది. అయితే ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి ఈ మధ్యాహ్నం సుప్రీం కోర్ట్ ఏం తీర్సునిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Supreme court  Telangana  ACB  Cash for vote case  bail  high court  

Other Articles