Joyride That Wasn't. Video Shows DMK's Stalin Slapping Metro Passenger

Poda dmk s stalin slaps party worker on chennai metro for refusing to move

MK Stalin, DMK, Jayalalithaa, Stalin slaps passenger, Jayalalithaa, Stalin slaps Chennai Metro passenger, Chennai metro, Tamil Nadu, DMK leader, Stalin metro ride, Stalin Vijayakant metro

A video clip of senior DMK leader MK Stalin slapping a passenger on the Chennai Metro went viral on Thursday, sparking a torrent of condemnation from civil society and political parties over his supposed uncivil behaviour.

ITEMVIDEOS: నెట్ లో హల్ చల్.. ప్రయాణికుడి చెంప చెల్లుమనింపించిన స్టాలిన్

Posted: 07/02/2015 07:05 PM IST
Poda dmk s stalin slaps party worker on chennai metro for refusing to move

డీఎంకే అధిప‌తి క‌రుణానిధి పుత్రర‌త్నం ముథ‌వేల్ క‌రుణానిధి స్టాలిన్.. స్టాలిన్ గా సుపరిచితులైన డిఎంకే అగ్రనేత.. కరుణానిధి రాజకీయ వారుసుడు.. తన హుందా తనాన్ని కొల్పోయాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు ప్రయాణికు సమస్యలను తెలుసుకునేందుకు రైలులో ప్రయాణించిన ఆయన అసలు విషయాన్ని మర్చిపోయి వ్యవహరించడంతో ఆయనే మీడియా సహా సామాజిక మాధ్యమంలో వార్తల్లోని వ్యక్తిగా మారారు. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది నిజం. ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ వైబ్ సైట్ లో చక్కర్లు కోడుతూ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ దీనికి కారణం ఏమిటంటారా..? ఆయన  సంయమ‌నం కోల్పోయి తోటి ప్ర‌యాణికుడిపై చేయిచేసుకోవడమే కారణమైంది.. దీనిని వీడియోలో బంధించి, స్టాలిన్ నిర్వాకం లోకానికి తెలియ‌జెప్పాడో ఔత్సాహికుడు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. గురువారం ఉద‌యం.. మెట్రో రైలులో స్టాలిన్ తొలి ప్రయాణం. కార్యక‌ర్తల‌తో క‌లిసి మెట్రో కంపార్ట్‌మెంట్‌లో స్టాలిన్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రయాణికుల‌ను ప‌క్కకు త‌ప్పుకోవాల‌ని హుకుం జారీచేశారు. ఇవేవీ ప‌ట్టించుకోక ఓ.. ప్ర‌యాణికుడు స్టాలిన్ రుస‌రుస‌ల్ని లైట్ తీసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన స్టాలిన్ అత‌డిపై చేయిచేసుకున్నాడు. చెంప మీద ఒక్కటిచ్చి.. వివాదంలో ఇరుక్కున్నాడు. కాగా.. అస‌లు విష‌యం అటుంచి విలేక‌రుల‌తో స్టాలిన్ మాట్లాడుతూ మెట్రో సేవ‌ల‌ను కొనియాడారు. మెట్రో రాక‌తో ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయన్నాడు. త‌న‌తో మాట్లాడిన ప్రయాణికులు మెట్రో ఛార్జీల త‌గ్గింపున‌కు కృషి చేయాల‌ని కోరార‌ని పేర్కొన్నాడు. ఏదేమైనా స్టాలిన్‌.. మ‌రీ! ఇంత దురుసుగా ప్రవర్తించాలా.. అని విప‌క్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MK Stalin  DMK  Jayalalithaa  Stalin slaps passenger  

Other Articles