d srinivas resings congress, to join TRS soon

Former pcc chief d srinivas resigns to congress

D.Srinivas resings congress, to join TRS, d.srinivas, keshava rao, sonia gandhi, rahul gandhi, YS Rajashekar reddy, congress, TRS, Former PCC President DS, Digvijay sing, ex-minister D Srinivas, Latest News,

Congress senior leader, former PCC president D Srinivas resings to congress party, says he will owe to sonia gandhi life long

తెలంగాణ కోసం కేసీఆర్ కమిట్మెంట్ నచ్చింది.. సోనియాకు జీవితాంతం రుణపడి వుంటా..

Posted: 07/02/2015 01:11 PM IST
Former pcc chief d srinivas resigns to congress

‘ఇది నా జీవితంలో చాలా బాధకరమైన రోజు’ అని మాజీ పిసిసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన తనకు పార్టీకి రాజీనామా చేయడం చాలా భాధకరమైన రోజుగా చెప్పుకోచ్చారు. ఇది నిజంగా ఊహించని పరిణామంగా ఆయన చెప్పుకోచ్చారు. కాంగ్రెస్ లో తనకు అత్యున్నత పదవులను అంగీకరించానని అంగీకరిస్తూనే ఢీఎస్.. ఆ పదవులలో కోనసాగడం ఒక్కటే కాదు.. తాను పార్టీ కోసం అనేక అవమానాలను కూడా భరించానని చెప్పుకోచ్చారు.

1969లో గాంధీ భవన్ లో అడుగుపెట్టాను.. నా పట్ల సోనియాగాంధీ చూపిన అభిమానానికి ధన్యవాధాలు అని ఆయన చెప్పారు. జీవితాంతం అమెకు రుణపడి వుంటానని చెప్పుకోచ్చారు. సోనియా గాంధీ తనను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పుకోచ్చారు. తాను పార్టీ వదలడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీద, అధ్యక్షురాలి మీద తనకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదన్నారు. తెలంగాణ కోసం కూడా పార్టీలో చర్చించింది, వైఎస్ హయాంలో 2000 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా అంశాన్ని లేవనెత్తింది తానేనని గుర్తు చేసుకోచ్చారు

తాను ఎమ్మెల్సీ పదవి కోసం ఆశించలేదని డీఎస్ చెప్పుకోచ్చారు. రాష్ట్ర పిసీసీస అధ్యక్షుడి హోదాలో ఎంతో మందికి భీ ఫామ్ లు ఇచ్చిన తాను ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడటం లేదని ఆయన అన్నారు, ఎమ్మెల్సీ పదవి తనకు లెక్కే కాదని స్పష్టం చేశారు. తన శిష్యురాలిగానే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పరిచయమైన అకుల లలితకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని డీఎస్ చెప్పుకోచ్చారు. అకుల లలిత అన్ని విధాలా ఎదగాలని ఆశించిన వ్యక్తిని తానని,  అమె గెలుపు కూడా తాను శాయశక్తులా కృషి చేశానని తెలిపారు.

దిగ్విజయ్ సింగ్ తన స్థాయిని మరచి మరింతగా దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ప్రకటన చూశాక ఆయనపై వున్న గౌరవం పోయిందన్నారు. చెప్పుడు మాటలు వినే దిగ్విజయ్ అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఇన్నాళ్లు తాను కాంగ్రెస్ లో కోనసాగినప్పుడు తన గురించి మాట్లాడే మొనగాడు ఎవరు లేరని, అయితే ఇప్పుడు విమర్శలు గుప్పించడంపై వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పుకోచ్చారు.

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని ఆయన నోక్కి చెప్పారు సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ది కోసం చాలా కమింట్ మెంట్ తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. బంగారు తెలంగాణ కోసం మాత్రమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు. తెలంగాణ అభివృద్ది కోసం తన వంతు సహకారం అందించాలన్న ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పుకోచ్చారు. తాను ఏ పదవినీ ఆశించి పార్టీ మారడం లేదని చెప్పారు పనిలో పనిగా ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం అవసరాల కన్నా ఎక్కువ ఆటంకాలు సృష్టిస్తోందన్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : d srinivas  resigns  congress  trs  telangana  KCR  sonia gandhi  

Other Articles