godavari | harathi | akanda harathi | pushkaralu | president

Andhra pradesh chief minister n chandrababu naidu will inaugurate the godavari harathi festival

godavari, harathi, , akanda harathi, pushkaralu, president, ap, cm, chandra babu, pranab mukarjee

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will inaugurate the Godavari Harathi festival, celebrating the sacred Godavari river on Pushkar ghat, in East Godavari district.

గోదారమ్మకు హారతి.. అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఏపి

Posted: 07/01/2015 09:38 PM IST
Andhra pradesh chief minister n chandrababu naidu will inaugurate the godavari harathi festival

పవిత్ర గోదావరి నదికి నేటి నుంచి నిత్యహారతి జరగనుంది. వారణాసిలో గంగానది తరహాలో ఇకపై రాజమండ్రి పుష్కరఘాట్‌లో రోజూ హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న వేడుకను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వారణాసిలో ఎప్పటి నుంచో సంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ సూర్యాస్తమయం వేళల్లో పవిత్ర గంగానదికి వివిధ రకాల హారతులతో పూజలు చేస్తారు. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన గోదావరి నదికి సైతం ఇదే వైభవం కొనసాగాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం నిత్య హారతి కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఇప్పటికే రాజమండ్రికి చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి పుష్కరఘాట్ వద్ద హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై పరిశీలిన చేసిన ఎ.పి. దేవాదాయశాఖ అధికారులు నిత్యహారతి కార్యక్రమానికి పూనుకున్నారు. రోజూ సూర్యాస్తమయం సమయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి నదికి హారతి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

రాజమండ్రిలో అఖండ హారతి కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.  సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తిరుమలలో రాష్ట్రపతి పర్యటన ముగిసిన వెంటనే సీఎం నేరుగా రాజమండ్రి వెళ్లనున్నారు. పుష్కరాల తర్వాత, ప్రతి పున్నమి, పండుగల సమయాల్లో అఖండ హారతి ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరో రెండు వారాల్లో గోదావరి పుష్కరాల ప్రారంభం కానుండటంతో  వేడుకను వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిపై రెండు వంతెనల మధ్య ప్రత్యేకంగా వేసిన వేదికపై హారతి కార్యక్రమాన్ని జరపనున్నారు. ఇవాల్టి నుంచీ శ్రీకారం చుట్టనున్న హారతి ఉత్సవాన్ని ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తిచేస్తున్నారు. ప్రతి పౌర్ణమికీ మహా హారతిని కార్తీక పౌర్ణమి సహా ఇతర పండుగ రోజుల్లో అఖండ హారతి ఇవ్వాలని నిర్ణయించారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులతో ప్రతినిత్యం సందడిగా కనిపించే పుష్కర ఘాట్ నిత్య హారతి ప్రారంభంతో మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : godavari  harathi  akanda harathi  pushkaralu  president  ap  cm  chandra babu  pranab mukarjee  

Other Articles