Airindia | Newyork cm fadnavis

Air india flight delayed by chief minister fadnavis

Airindia, Newyork, cm fadnavis, newyark tour, air india

At a time when India's repeatedly expressing its frustration with VIP culture, politicians and their aides appear to remain in thrall to special treatment. On Monday morning, an Air India flight from Mumbai to New York, with Chief Minister Devendra Fadnavis on board, was delayed by nearly an hour on account of a member of his entourage, sources said.

దేవ.. దేవ.. దేవేంద్ర ఫడ్నవిస్ ఏ:బాగోలేదు

Posted: 07/01/2015 03:49 PM IST
Air india flight delayed by chief minister fadnavis

నిమిషం లేటైనా రైలు ఎవరి కోసమూ ఆగదు.. క్షణం లేటైనా ఫ్లైట్ ఆగదు. కానీ ఇదంతా మామూలు వ్యక్తులకు అదే విఐపిలకు, వివిఐపిలకు ఐతే అదంతా ఏమీ కుదరదు. కోరితే కొండ మీద కోతి ఐనా దిగిరావాల్సిందే అన్నట్లు రైలేంటి.. ఫ్లైటైనా రావాల్సిందే. అయితే ఆ మధ్య రైల్వే మంత్రి కోసం వెళ్లిన ట్రైన్ వచ్చిన వార్త చదివాం. అయితే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వల్ల 250 మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల సహనాన్ని నిత్యం ఎదుర్కొనే ఎయిరిండియా మరోసారి వారి ఓపికకు పరీక్ష పెట్టింది. ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిరిండియా విమానంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ తన బృందంతో వెళ్లాల్సి ఉంది. ఎయిరిండియా స్వామి భక్తి కారణంగా దాదాపు 250 మంది అంతర్జాతీయ ప్రయాణికులు గంటపాటు విమానంలో వేచి ఉండాల్సి వచ్చింది.  అయితే  ముఖ్యమంత్రి  ప్రిన్సిపల్‌ సెక్రటరీ  విమానాశ్రయానికి వచ్చినప్పుడు తన పాత పాస్‌ పోర్ట్‌ తో వచ్చారు. దీంతో ఆయన కొత్త పాస్‌ పోర్ట్ తీసుకురావడంకోసం విమానాన్ని నిలిపివేశారు.

అయితే ఈ వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించిది ఎయిరిండియా. సాంకేతిక కారణాల వల్లనే ఆలస్యం జరిగినట్టు చెప్పుకొచ్చింది. తన వల్ల ఆలస్యం జరిగిందనడాన్ని తోసిపుచ్చుతూ సీఎం ఫడ్నవిస్ ట్వీట్టర్‌లో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఫడ్నవిస్‌  ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంట్రీగేటు వద్ద ఉన్నప్పుడు సీఎం అప్పటికే విమానంలో ఉన్నారని చెప్పారు . అప్పటికే  సీఎం ఫడ్నవిస్‌ వద్ద వీసాలేనట్టు ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టించుకోనప్పటికీ .. గేట్‌ వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకోడంతో బోర్డింగ్‌ పాస్‌ విషయంలో ఆలస్యం జరిగినట్టు చెప్తున్నారు. ఏది ఏమైనా సీఎం పీఎస్‌  నిర్వాకంతో దాదాపు గంటన్నరపాటు ప్రయాణికులు వేచి ఉండాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airindia  Newyork  cm fadnavis  newyark tour  air india  

Other Articles