d srinivas held talks with cm kcr but says its a formal meet

D srinivas met telangana cm kcr says it is formal

D.Srinivas may join TRS, d.srinivas, keshava rao, sonia gandhi, rahul gandhi, YS Rajashekar reddy, congress, TRS, Former PCC President DS, ex-minister D Srinivas, Latest News

Congress senior leader D Srinivas on Wednesday met CM K Chandrasekhar Rao and after the meeting said that the meeting is formal.

కేసీఆర్ ను పరామర్శించా.. అంతే.. అంతకుమించి ఏమీలేదు..

Posted: 07/01/2015 01:57 PM IST
D srinivas met telangana cm kcr says it is formal

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం డీఎస్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకున్నారు. డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్‌ ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్‌ చేయకపోవడం, జిల్లాకు సంబంధించి తన శిష్యురాలు అకుల లలితకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇస్తూ... ఆ సమాచారం తనకు తెలపకపోవడంపై కూడా ఆయన కాంగ్రెస్‌ అధిష్టానంపై అలకబూనేట్టు చేసింది.

ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై డీఎస్ ఆగ్రహంగా ఉన్నారు. దిగ్విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ లో డీ.శ్రీనివాస్ ప్రభావం తగ్గిపోయింది. యువనాయకత్వానికి పగ్గాలు అప్పగించాలని యోచించిన పార్టీ హై కమాండ్ భాటలో వెళ్తున్న ఆయన.. పార్టీని రెండు వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకురావడంలో తనపదైన పాత్ర పోషించిన సీనియర్లను పక్కనబెట్టడం రుచించలేదు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని భావించిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది.

ఈ నేపథ్యంలో డి.శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిఎస్‌ కలుసుకున్నారు ఆయనకు త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహించే పదవిని ఇవ్వనున్నారని సమాచారం. దీంతో పాటు మంత్రి పదవిని కూడా ఇచ్చే యోచనలో తెలంగాణ రాష్ట్ర పమితి ఉందని తెలుస్తోంది. ఇది సాధ్యంకాని పక్షంలో డీఎస్ కు రాజ్యసభకు పంపించేందకు కూడా పార్టీ అధిష్టానం సూచనప్రాయంగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వారి భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి  ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి మాత్రమే వచ్చానని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇతర నేతలు పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయాన్ని మాత్రం డీఎస్ ప్రస్తావించలేదు.

కాగా ఈ లోగా రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న ఈ దుర్లభ పరిస్థితి నుంచి భయట పడేందుకు ఇప్పడిప్పుడే చర్యలు తీసకుంటున్న సమయంలో పిసిసీ మాజీ అధ్యక్షులు ఒకరు తరువాత మరోకరు పార్టీని వీడటంతో కలవరం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో బోత్స సత్యనారాయణ, ఇటు తెలంగాణలో డి.శ్రీనివాస్ పార్టీని వీడటం కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బే. అయితే దిద్దుబాటు చర్యలకోసం రంగంలోకి దిగిన పిసిసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, శ్రీధర్ బాబు, డీకే ఆరుణ తదితర నేతలు ఏకంగా డీఎస్ నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో.. చుక్కెదురు కావడంతో వెనుదిరిగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : d srinivas  kcr  congress  trs  telangana  camp office  

Other Articles