upset in congress meet, adam santosh men plot on VH

Risk congress meeting at secunderabad

risk congress meeting at secunderabad, adam santosh men plot on VH, congress, Secunderabad, Rajyasabha member, v hanumantha rao, jana reddy, uttam kumar reddy, hyderabad, congress leader adam santosh men

upset in congress meet held at secundrabad as congress leader adam santosh men plot on VH

కాంగ్రెస్ లో అంతే.. తిట్టుకుని. తన్నుకుని.. ప్రజాస్వామ్యం అంటారు..

Posted: 06/30/2015 10:48 PM IST
Risk congress meeting at secunderabad

కాంగ్రెస్ పార్టీ అనేగనే మహా సముద్రమని, దేశంలోని అనేక పార్టీలు కాంగ్రెస్ చలువ వల్లే వచ్చాయని ఒకటి రెండు కాదు గంటల కోద్ది ప్రసంగాలను వినిపిస్తుంటారు కాంగ్రెన్ నేతలు. అయితే కాంగ్రెస్ నేతల ఒకరికోకరికి మధ్య అసలు పొసగదు. కానీ వారంతా కాంగ్రెస్ లోనే కోనసాగుతుంటారు. ఒకరు సై అంటే మరోకరు నై అంటారు ఇంకోకరు హై హై అంటూ నిట్సూర్చుతారు. అయినా కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పాలంటే వందల ఏళ్లనాటి చరిత్ర.. పార్టీ స్థాపన మహాయజ్ఞం, పార్టీకి ప్రస్థానం మహా ఉద్యమం అంటూ చెప్పమంటే వినేవారికి బోర్ కోట్టకుండా ఏంత సూపైనా ప్రసంగాలు గుప్పిస్తారు నేతలు.

క్రమశిక్షణ అన్న పదానికి అర్థం తెలియని పార్టీ అంటూ దేశంలో ఏదైనా వుంది అంటే అది కాంగ్రెస్ కాక మరోటి కాదని పలు సందర్భాలలో నిరూపితమైంది. తాజాగా, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో నిర్వహఇంచిన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మాట్లాడుతుండగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత వి. హనుమంతురావు అడ్డుకున్నారు. దీంతో స్ధానిక కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వి. హనుమంతురావుకి చుక్కెదురైంది.

వీహెచ్ తీరుని నిరసిస్తూ ఆదాం సంతోష్ వర్గీయులు వి. హనుమంతురావుపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనతో సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు. ఇరు వర్గాల మధ్య కాసేపు రసాభాస నెలకొంది. ఈ ఘటన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత జానారెడ్డిల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఊహించని విధంగా ఈ సమావేశం రసాభాసగా మారడంతో నాయకలు సర్ది చెప్పారు. అనంతరం సభ యధవిధిగా సాగింది.

అయితే చిన్న, పెద్ద, సీనియర్, జూనియర్ అన్న తారతమ్యాలు లేకుండా ఎవరు పడితే వారు.. ఎవరిపైకి పడితే వారి పైకి వెళ్లే అవకాశం వున్నది మాత్రం ఒక్క కాంగ్రెస్ లోనే అని ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వ్యంగస్త్రాలపై స్పందించిన పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తమ పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం లేదని, చిన్న పాటి మనస్పర్థలు మాత్రమే వుంటాయని, వాటిని పక్కన బెడితే.. ఏ పార్టీలోనూ లేని ప్రజాస్వామ్యం మాత్రం మా పార్టీలోనే వుందని అంటున్నారు. అంతే మరి తిట్టకుంటారు.. తన్నకుంటారు.. ప్రజాస్వామ్యం అధికమని సర్థిచెప్పుకుంటారు. కాంగ్రెస్ లో అంతే మరి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  Secunderabad  v hanumantha rao  jana reddy  uttam kumar reddy  

Other Articles