Telangana IT Minister KTR helps poor artist Siricilla Ramulu Aka Nagaiah | Telangana govt

Telangana it minister ktr helps poor artist nagaiah

ktr, telangana it minister ktr, artist Siricilla Ramulu, artist nagaiah, Siricilla Ramulu film career, telugu artist Siricilla Ramulu news, Siricilla Ramulu news, Siricilla Ramulu updates, actor nagaiah news, ktr with Siricilla Ramulu, ktr one lakh check to nagaiah

Telangana IT Minister KTR helps poor artist Nagaiah : Telangana IT cum Panchayati Raj Minister,KTR, handed over one lakh rupees to him and also took the issue to MAA president Rajendra Prasad to help him.

దీనస్థితిలో వున్న పేదకళాకారుడికి కేటీఆర్ ఆర్థికసాయం

Posted: 06/29/2015 02:43 PM IST
Telangana it minister ktr helps poor artist nagaiah

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ సినిమాలో ఒక పేదవాడిగా పాత్ర పోషించిన నటుడు సిరిసిల్లా రాములు (నాగయ్య).. అందరికీ సుపరిచితులే! ఆ పాత్రలో నటించిన ఆయన.. తన నటనాశైలితో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసుకున్నాడు. అటువంటి అద్భుతమైన పాత్రలో నటించిన ఈయనకు కాలం అంతగా కలిసిరాలేదు. ఈయనకు సినిమాల్లో నటించే ఆఫర్లు అంతగా దక్కలేదు.

చాలాకాలం నుంచి అవకాశాలు రాక, తన దీనపరిస్థితిని ఎవరితోనూ వ్యక్తపరచలేక ఆయన అడుక్కోవడం మొదలెట్టాడు. గతకొన్నాళ్ల నుంచి హైదరాబాద్ నగరంలో ఆయన బిచ్చమెత్తుకుంటూ తన జీవనాన్ని కొనసాగించాడు. ఈ విధంగా ఈయన దీనపరిస్థితిని గమనించిన కొందరు వ్యక్తులు.. ఆ పేద ఆర్టిస్టును ఆదుకోవాల్సిందిగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ‘మా’, తెలంగాణ ప్రభుత్వానికి కోరారు.

ఆ పేద ప్రముఖ కళాకారుడైన నాగయ్య దీనస్థితిని తెలుసుకున్న టీఎస్ మంత్రి కేటీఆర్.. వెంటనే స్పందించారు. తక్షణమే లక్ష రూపాయలు ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాదు.. వృద్ధ కళాకారుల పింఛను కింద ఆయనకు ప్రతినెలా రూ.1500 పింఛను అందజేస్తామని కేటీఆర్ తెలిపారు. అలాగే.. నాగయ్య విషయాన్ని ‘మా’ ప్రసిడెంట్ రాజేంద్రప్రసాద్ కు వివరించానని అన్నారు.

తెలంగాణలోని కళాకారులకు ఆర్థికసాయాన్ని అందించాలన్న విషయాన్ని తాను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని కేటీఆర్ తెలిపారు. ఆ విషయంపై త్వరలోనే చర్చలు జరపనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  artist nagaiah  telangana govt  

Other Articles