India ranks 143rd, way behind the likes of Bhutan, Nepal, Sri Lanka & Bangladesh | worlds peaceful countries

India ranks a lowly 143rd on a global peace index

india latest news, worlds peaceful countries, iceland most peaceful nation, peaceful countries in world, peaceful nations in worlds, india ranks 143 global peace index, bangladesh peaceful rank, sri lanka latest news, nepal updates, bhutan peaceful country

India ranks a lowly 143rd on a Global Peace Index : India ranks a lowly 143rd on a Global Peace Index, lagging way behind the likes of Bhutan, Nepal, Sri Lanka and Bangladesh with Iceland emerging as the most peaceful nation in the world.

‘ఆ విషయంలో’ భారత్ కంటే భూటాన్, నేపాలే బెస్ట్!

Posted: 06/29/2015 12:16 PM IST
India ranks a lowly 143rd on a global peace index

ప్రపంచదేశాలకు పోటీగా నిలుస్తున్న భారతదేశం.. కొన్ని వ్యవహారాల్లోనూ వెనుకంజలో వున్న విషయం తెలిసిందే! అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. శుభ్రతలో ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ చాలా వెనుకబడి వుంది. అలాగే.. మరో విషయంలోనూ భారత్ చాలా వెనుకబడి వుందని ఒక స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన ‘వరల్డ్ మోస్ట్ పీస్ ఫుల్ దేశాలు-2015’ అధ్యయనంలో వెల్లడైంది.

ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశాల్లో భారత్ 143వ స్థానంలో వుందని సదరు సంస్థ అధ్యయనంలో తేలింది. ఇక పాకిస్థాన్ 154లో స్థానంలో నిలిచింది. నిత్యం నేరాలు, తీవ్రవాద హింసలు, చాలా అధ్వాన్నమైన అంతరంగిక భ్రదతా పరిస్థితులు వంటి కారణాల వల్ల పాకిస్థాన్ ఆ స్థాయిలో వెనుకబడిందని ఆ సర్వే పేర్కొంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో అటువంటి పరిస్థితులే మరింత ఎక్కువగా వుండటంతో ఆ దేశం 160వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ లో కూడా అత్యాచార ఘటనలు, అల్లకల్లోలం సృష్టించే విధించే ర్యాలీలు నిర్వహించడం, గృహహింసలు... ఇలా ఎన్నో నేరాలు-ఘోరాలు లో తరుచూ వెలుగులోకి వస్తున్న క్రమంలో అది 143వ స్థానంలో నిలిచినట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది.

అయితే.. ఈ మూడు దేశాల కంటే భూటాన్ (18), నేపాల్(62), బంగ్లాదేశ్(84), శ్రీలంక(114)లు మెరుగైన పరిస్థితిలో వున్నట్లు తేలింది. ఇక అత్యంత ప్రశాంతమైన దేశాల్లో ఉత్తర అట్లాంటిక్ లో వున్న ఓ చిన్న ద్వీపమైన ఐస్ ల్యాండ్ అగ్రస్థానంలో వున్నట్లు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దాని తర్వాత డెన్మార్క్, ఆస్ట్రియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏదేమైనా.. ప్రశాంతదేశాల్లో భారత్ 143వ స్థానంలో వుండటం చూస్తుంటే దేశంలో ఎన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : worlds peaceful countries  india  srilanka  bangladesh  iceland  

Other Articles