Home Ministry disagrees with Attorney General's view on Sun TV

Mha rules out security clearance for sun tv

sun tv, dayanidhi maran, sun tv security clearance, sun tv news, sun tv home ministry, Information and broadcasting ministy, Home ministry, ministry of Home affairs, Sun television network

Notwithstanding objections from I&B ministry, Home Ministry today made it clear that it will not give security clearance to Maran-owned Sun television network.

జెమినీ టీవీ (సన్) నెట్ వర్క్ ప్రసారాలకు త్వరలో బ్రేక్..?

Posted: 06/28/2015 09:58 PM IST
Mha rules out security clearance for sun tv

సన్ టీవీ నెట్ వర్క్ ప్రసారాలు నిలిచిపోనున్నాయా..? ముఖ్యమంగా తెలుగువారికి జెమినీ టీవీగా పరిచయమైన నెట్ వర్క్ గ్రూప్‌ ప్రసారాలు ఆగిపోతాయా? తెలుగువారిని సుమారుగా రెండు దశాబ్ధాల అలరిస్తున్న జెమినీ సీరియల్స్‌, జెమినీ మూవీస్ (సినిమాలు), జెమినీ కామెడీ, జెమినీ  సాంగ్స్ (పాటలు) ఇలా జెమినీ ప్రసారాలన్నీ దూరమవుతాయా? అంటే.. రమారమి అలాందేదో జరగబోతోందని.. కేంద్ర హోంశాఖ వ్యవహారం చూస్తే అనిపిస్తోంది. సన్‌ టీవీ నెట్‌ వర్క్‌కు భద్రతా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రహోంశాఖ మరోమారు స్పష్టం చేసింది. సన్‌ నెట్‌ వర్క్‌కు భద్రతా పరమైన అనుమతి ఇవ్వాలని ఇటీవలే అటార్నీ జనరల్‌ సలహా ఇచ్చారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కూడా ఇదే సిఫార్స్‌ చేసింది. అయినా కేంద్రహోంశాఖ పట్టించుకోలేదు. సన్‌ నెట్‌ వర్క్‌కు భద్రతాపరమైన అనుమతి ఇచ్చేదిలేదని తేల్చి చెప్పింది. ఈ సంస్థ యజమానులు పలు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది.

అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తం చేయవచ్చని, అంతమాత్రాన హోంశాఖ వైఖరి మారదని స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ... పలు వివాదాల నడుము చిక్కుకున్న ఛానెల్ యజమానులు, పలు కేసులలో నిదితులుగా అభియోగాలను కూడా ఎదుర్కోంటున్నారని తెలిపింది. కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌, ఆయన సోదరుడు కళానిధి మారన్‌ నిర్వహిస్తున్న సన్‌ నెట్‌వర్క్‌లో 33 ఛానళ్లు, పలు ఎఫ్‌ఎం స్టేషన్లు ఉన్నాయి. దయానిధి మంత్రిగా ఉన్నప్పుడు 300 టెలిఫోన్‌ లైన్లను సన్‌ నెట్‌వర్క్‌కు కేటాయించడంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సంస్థ యాజమాన్యంపై మణి లాండరింగ్‌ సహా పలు కేసులు ఉన్నాయి. ఎయిర్‌టెల్‌, మాక్సెస్‌ స్కామ్‌లో మారన్‌ సోదరులు నిందితులు. వీరికి సంబంధించిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. దీంతో సన్‌ టీవీకి భద్రతాపరమైన అనుమతులు ఇవ్వడానికి చట్టప్రకారం ఎలాంటి అనుమతి లేదని హోంశాఖ తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ministry of Home affairs  security clearance  Sun TV Network  

Other Articles