Caught on Camera: Dog Chases Away Leopard From House in Mumbai

Dog chases away leopard from house in mumbai

Dog Chases Away Leopard From House in Mumbai, CCTV, Sanjay Gandhi National Park, forest authorities, Leopard in Borivali, Borivali, Leopard in residential area, Leopard, Leopard on CCTV, Mumbai, Caught on Camera, Leopard, Leopard in Housing Society, Leopard in Borivali, CCTV footage, Leopard caught on camera, dog vs leopard, leopard enters house

In CCTV footage from outside a bungalow in Mumbai, a leopard is seen slinking away after being barked at by the dog of the house.

ITEMVIDEOS: చిరుతను తరిమిన శునకం.. నెట్ లో హల్ చల్..

Posted: 06/26/2015 05:39 PM IST
Dog chases away leopard from house in mumbai

గల్లీ కా కుత్తా.. అని సిల్లీగా అన్న .. అలాంటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోని విశ్వస జంతువు శునకం మాత్రం తమ యజమాని సహా యజమాని కుటుంబాన్ని క్రూర మృగం నుంచి కాపాడింది. సరిగ్గా రెండు గంటల సమయంలో ఓ బంగ్లాలో వున్నవారంతా హాయిగా ఆదమరచి నిద్రపోతున్నారు. ఇంటికి కాపలాగా వున్న కుక్క కూడా నిద్రలోకి జారుకుంది. ఈ లోపు స్థానికంగా వుండే జంతు ప్రదర్శన శాలలో నుంచి తప్పించుకుని వచ్చిన ఓ చిరుత పులి ప్రవేశించింది. బాగా ఆకలితో ఉన్నదనుకుంటా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కసిగా.. కుక్కపై దాడి చేయాలనుకుంది. కానీ ఆ కుక్క ఇంటిలొపలికి వెళ్లే ప్రవేశద్వారానికి ముందున్న దగిలో వుంది. దానికి గ్రిల్ డోర్ ( ఇనుప చువ్వలతో చేసిన ద్వారం) అడ్డుగా వుంది.

దీంతో ఆ గది చుట్టే అటూ ఇటూ తిరిగుతూ చివరికి తన పంజాను ఇనుప చువ్వల నుంచే దూర్చే ప్రయత్నం చేసింది చిరుత. అప్పటి వరకు ఆదమర్చి నిద్రపోతున్న శునకరాజం కూడా చువ్వల అలకిడికి లేచింది. అదే సమయంలో చిరుత గ్రాడింపు కూడా చేయడంతో.. లేచి లెవ్వగానే చిరుతకు చుక్కలు చూపింది. చిరుతను చూడగానే ఏ మాత్రం భయానికి లోనుకాకుండా చెవులు చిల్లులుపడేలా దానికి ఎదురుపడి ఆరవడం మొదలు పెట్టింది. ఆ అరుపులకు చిరుత జంకి అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది.

ఇదంగా ముంబాయి శివారు ప్రాంతంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కు సమీపంలోని బోరివాలి ప్రాంతంలోని ఓ బంగ్లాలో చోటుచేసుకుంది. ఆ బంగ్లాకు వెలుపల బిగించిన సిసిటీవీ కెమెరాల్లో ఈ దృశ్యం రికార్డు అయ్యింది. ఆర్థరాత్రి తమ శునకం అరుపులు విన్నారో లేక రోజువారి తనిఖీలలో బాగంగా చూశారో.. ఇంటి యజమానాలు.. చిరుతను తరిమిన శనకం దృశ్యాలను చూసి అదిరిపడ్డారు. తమ శునకం తమను కాపాడిందని పేర్కోంటూ ఈ వీడియోను యూట్యూబ్ లో పెట్టగా.. అది హల్ చల్ చేస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog  Chases Away  Leopard  Mumbai  CCTV  

Other Articles