Governor | narasimhan | Delhi, Central Home ministry, Telugu states,Taping, cash for vote case

Governor narasimhan got call from central home ministery

Governor, narasimhan, Delhi, Central Home ministry, Telugu states,Taping, cash for vote case

Governor narasimhan Got call from central Home ministery. Governor will go delhi in the evening. May home ministry and governor will discuss about the situation in the telugu states.

ఢిల్లీకి రమ్మని గవర్నర్ నరసింహన్ కు పిలుపు

Posted: 06/25/2015 12:28 PM IST
Governor narasimhan got call from central home ministery


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ను పిలిచి పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ పై కేంద్రం కదులుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రెండు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం, ట్యాపింగ్ వివాదాలు పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. ట్యాపింగ్ వివాదంపై ఇప్పటికే చంద్రాబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కాగా ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడుమీదుంది. తాజాగా ఓటుకు నోటు వ్యవహారంలో టీవిల్లో ప్రసారమైన టేపులు ఒరిజినల్ అని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదించిన నేపధ్యంలో గవర్నర్ కు ఢిల్లీ నుండి పిలునురావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం శాఖ నుండి గవర్నర్ నరసింహన్ పిలుపందుకున్నారు.

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ చేరుకొని అక్కడ వారితో గవర్నర్ నరసింహన్ చర్చించనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి తెర తీసిన ఓటుకు నోటు, ట్యాపింగ్ పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సెక్షన్ 8 పై కూడా కీలక చర్చ జరిగే అవకా:శం కనిపిస్తోంది. అయితే ఢిల్లీలో గవర్నర్ తో కేంద్ర హోం శాఖ ఎలాంటి చర్చలు జరుపుతుంది అన్నది అందరికి ఇంట్రస్టింగ్ గా మారింది. కాగా ఇప్పటికే రెండురాష్ట్రాల మధ్యవివాదాలు సమిసిపోయేలా చూడాలని కేంద్రం గవర్నర్ ను సూచించింది. కానీ రాష్ట్రాల మధ్య వివాదాలకు మాత్రం తెర పడలేదు. ఇలాంటి నేపధ్యంలో కేంద్రం గవర్నర్ కు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్నది ఎదురుచూడాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  narasimhan  Delhi  Central Home ministry  Telugu states  Taping  cash for vote case  

Other Articles