FIR against Mamata Banerjee's nephew Abhishek for making 'gouge out eyes' remark

Fir filled against parliamentarian abhishek banerjee

FIR against parliamentarian abhishek banerjee, Mamata Banerjee, Abhishek Banerjee, West Bengal, Trinamool Congress, Bharatiya Janata Party, Communist Party of India-Marxist, Jorasanko police station, chop off hands, tear out eyes,

An FIR was filed against West Bengal Chief Minister Mamata Banerjee's nephew Abhishek Banerjee in Jorasanko police station on Tuesday for publicly threatening to "chop off hands and tear out eyes" of those who dared to challenge Trinamool Congress.

మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ పై కేసు నమోదు..

Posted: 06/23/2015 07:32 PM IST
Fir filled against parliamentarian abhishek banerjee

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోరసాన్ కో పోలిస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఓ సభలో అభిషేక్ ముఖర్జీ కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం అంటూ విపక్షాలను హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాలు అభిషేక్ ముఖర్జీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పట్టబట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు రంగంలోకి దిగిన జోరసాన్ కో పోలీసులు కేను సమోదు చేశారు.

ఇంతకీ అభిషేక్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు ఏమిటో తెలుసా..? మా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే కళ్లు పీకేయడం ఖాయమని కోల్‌కత్తాలో జరిగిన తృణమూల్‌ సభలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వేలెత్తి చూపితే చేతులు నరికేస్తామని అభిషేక్‌ బెనర్జీ బెదిరించారు. 27 ఏళ్ల అభిషేక్‌ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన దూకుడు సీఎం మమతకు కాస్త ఇబ్బందిగానే పరిణమించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బీజేపీ మండి పడుతున్నాయి. కార్యకర్తలను రెచ్చగొట్టడం తగదని కాంగ్రెస్‌ గుర్తు చేసింది. ఎన్నికలకు భయపడి మమత తన అనుచరులను రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్‌ నేత పీఎల్‌ పునియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం లాంటి బెదిరింపులు గర్హనీయమని అన్నారు. పార్టీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలన్నారు. మాట్లాడే తీరు మర్యాద పూర్వకంగా ఉండాలని పునియా సూచించారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన అన్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీ తన మేనల్లుడిని కాపాడే ప్రయత్నం చేయకూడదని పునియా పేర్కొన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యుడుగా ఉన్నటువంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. హింసను ప్రేరేపించేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారని, హింసకు దిగడం ఒక్కడే ఆమె ముందున్న మార్గంలా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FIR  abhishek banerjee  MP  Trinamool Congress  

Other Articles