ఏపి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఓటుకు నోటు వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన ట్యాపింగ్ కోణం తాజాగా తెలంగాణ అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే ఏపి ప్రభుత్వం ట్యాపింగ్ తో సంబందం ఉన్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు పంపిన ఏపి పోలీసులు దానిపై వారి వివరణ కోరారు. తెలంగాణ కు చెందిన వారెవరైనా ట్యాపింగ్ చెయ్యాలని ఆదేశించారా..? లేదా తెలంగాణ ప్రభుత్వం నుండి లేఖ ఏమైనా అందిందా..? లేదా కావాలనే ఇలాంటి పని చేశారా?? చేస్తే ఎంత మంది చేశారు..? ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు..? ఎంత కాలంగా చేస్తున్నారు..? అన్న కోణంలో ఏపి సర్కార్ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అటు సర్వీస్ ప్రొవైడర్లకు, ఇటు టి న్యూస్, సాక్షిలకు నోటీసులు పంపించారు ఏపి పోలీసులు. ఈ కేసులో మొత్తం 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులిచ్చి మూడు కంపెనీల నుండి వివారాలు సేకరించారు. యునినార్, డొకొమో, ఎయిర్ టెల్ ప్రతినిధులను పోలీసులు ప్ర:శ్నించారు.
అయితే ఏపికి చెందిన 147 సెల్ నెంబర్స్ పై సర్వీస్ ప్రొవైడర్లను ఏపి అధికారులు ప్రశ్నించారు. అయితే హైదరాబాద్ లోని యునినార్ ఫ్యాన్సీ నెంబర్లు ఎక్కువగా ఉండటంతో యునినార్ ప్రతినిధులను ఎక్కువసేపు విచారించారు. అయితే ఇక కాల్ డేటాకు సంబందించిన అన్ని వివరాలను సేవ్ చెసి ఉంచాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లకు ఏపి అధికారులు ఆదేశించారు. మూడు నెలల డాటా సేవ్ చేసి ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే సర్వీస్ ప్రొవైడర్లు ట్యాపింగ్ పై ఎలాంటి వివరణ ఇచ్చారు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిజంగా ట్యాపింగ్ కు పాల్పడ్డట్లు సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పుకున్నారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారం ట్యాపింగ్ కేసులో ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో సర్వీస్ ప్రొవైడర్లు ఏం చెప్పారని సర్వత్రా చర్చ సాగుతోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more