Wife of Israeli Interior Minister Silvan Shalom Makes controversial tweet on obama | Twitter

Wife of israeli interior minister silvan shalom controversy tweet on obama

judy mozes, barack obama controversy tweet, silvan shalom wife judy mozes, us president barack obama, judy shalom controversy tweet

wife of Israeli Interior Minister Silvan Shalom controversy tweet on obama : Judy Shalom Nir-Mozes, an Israeli TV and radio personality and the wife of Interior Minister Silvan Shalom, apologized on Sunday after tweeting, and then deleting, a joke about U.S. President Barack Obama.

ఒబామాపై మంత్రిగారి భార్య ‘బ్లాక్’ జోక్!

Posted: 06/22/2015 12:19 PM IST
Wife of israeli interior minister silvan shalom controversy tweet on obama

రాజకీయాల్లో ఒక మంత్రిపై మరొక మంత్రి వ్యాఖ్యలు చేసుకోవడం సహజమే కానీ.. ఏకంగా అధ్యక్షుడిపైనే విమర్శలు గుప్పించడం తగదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం.. సదరు మంత్రికి తగిన రీతిలో ట్రీట్ మెంట్ లభిస్తుంది. ఈ విషయాన్ని విస్మరించిన ఓ మంత్రిగారి సతీమణి.. ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపైనే ‘బ్లాక్’ జోక్ వేసి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఆమె ట్విటర్ లో ఒబామాపై వేసిన బ్లాక్ జోక్ ని అందరూ ఖండించడంతో.. ఆమె చేసిన తప్పును తెలుసుకుని వెంటనే క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆమె ఏం ట్వీట్ చేసింది? అని అనుకుంటున్నారా.. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజియన్ నెతన్యాహు మంత్రివర్గంలో సిల్వాన్ షాలోమ్ అనే వ్యక్తి మంత్రిగా వున్నారు. ఆయన సతీమణి అయిన జూడీ షాలోమ్ ట్విటర్ లో ఒబామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒబామా కాఫీ’ అంటే ఏంతో తెలుసా? అది బ్లాక్ అండ్ వీక్’ అని ఆమె ట్విటర్ వేదికగా ట్వీట్ చేసింది. అంతే! ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. జోక్ అనుకుని ట్వీట్ చేస్తే అది ఆమెకు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈమె చేసిన ఈ ట్వీట్ పై పలువురు ఒక్కసారిగా దాడికి దిగారు. ఆ ట్వీట్ కి రివర్స్ లో ఈమెపై విమర్శలు గుప్పించేశారు. దీంతో తీవ్ర ఆందోళనలకు గురైన ఆమె.. తాను చేసిన ట్వీట్ కి క్షమాపణలు కోరుతూ తన మాటలను తొలగిస్తున్నట్లుగా తెలిపింది.

చివరగా షాలోమ్ తాను చేసిన ట్వీట్ కి వివరణ ఇచ్చుకుంది. తాను ఏ ఒక్క జాతినో, మతాన్నో కించపరుస్తూ ఆ ట్వీట్ చేయలేదని, కేవలం జోక్ నేపథ్యంలో అలా పేర్కొన్నానని తెలిపింది. ఏదేమైనా.. నిన్నటివరకు ప్రపంచానికి అంతగా తెలియని ఈవిడ.. ఒబామాపై ‘బ్లాక్’ జోక్ వేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని చూస్తుంటే.. బహుశా పబ్లిసిటీ కోసమే ఆమె ఒబామాపై ఆ విధమైన ట్వీట్ చేసిందేమోనన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

judy-moze-tweet-obama

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles