dasari narayana rao praises cm kcr | basthi movie audio function | shilpakala vedika

Dasari narayana rao praises cm kcr basthi movie audio function

dasari narayana rao, cm kcr, basthi movie audio function, basthi movie news, jayasudha son sreyan, kcr speech, dasari speech, jayasudha news, murali mohan, senior naresh, sreyan debut movie basthi

dasari narayana rao praises cm kcr basthi movie audio function : Famous telugu Director dasari narayana rao praises cm kcr in basthi movie audio launch event. He said kcr know how to give respect to artists.

‘బస్తీ’లో కేసీఆర్ భజన చేసిన దాసరి

Posted: 06/22/2015 11:13 AM IST
Dasari narayana rao praises cm kcr basthi movie audio function

టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు ‘బస్తీ’లో తెలంగాణ సీఎం కేసీఆర్ భజన బాగానే చేశారు. ఇక్కడ ‘బస్తీ’ అంటే ఏదో ఒక గల్లీ కాదులెండి.. సహజనటి జయసుధ తనయుడు శ్రేయన్ వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న సినిమా పేరు! ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం శిల్పాకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా కొందరు సీనియర్ నటీనటులతోపాటు దాసరి నారాయణరావు, సీఎం కేసీఆర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగానే కేసీఆర్ ను దాసరి ఆకాశానికెత్తేశారు.

‘కేసీఆర్ కళలు, కళాకారుల గురించి తెలిసిన వ్యక్తి. కళాకారులను ఎలా, ఎంత గౌరవించాలో తెలిసిన వ్యక్తి’ అని దాసరి కొనియాడారు. తనకు తెలిసి కేసీఆర్ ఓ సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరు కావడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ పై ఓ ఛలోక్తి కూడా విసిరారు. ‘ఇటీవలే కేసీఆర్ బస్తీలను బాగు చేసే కార్యక్రమాలకు ఎక్కువగా వెళుతున్నారు. ఈ వేదిక కూడా ‘బస్తీ’ అనుకునే వచ్చి వుంటారని ఎవరో నాతో అన్నారు’ అని దాసరి చెప్పగానే.. వేదికపై వున్నవారితోపాటు అక్కడికి విచ్చేసిన అభిమానులు ఒక్కసారిగా నవ్వేశారు. అక్కడున్న అతిథులు ఈ దాసరి ‘హ్యూమర్ టచ్’ని ప్రశంసలతో పొగిడేశారు.

ఇక ఈ ఆడియో ఫంక్షన్ నేపథ్యంలోనే దాసరి మాట్లాడుతూ.. చిన్న సినిమాల నిర్మాతలను ఆదుకోవాలని, చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల్లో మార్పు తేవాలని కోరారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతూ.. చిత్రపరిశ్రమలో సరికొత్త మెరుగులు దిద్దేందుకు తమ ప్రభుత్వం సహాయం చేస్తుందని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  cm kcr  basthi movie  

Other Articles