Bangladesh vs India, 2nd ODI, Raina, Dhoni steady India

Bangladesh have chance to seal first ever series against india

Bangladesh, Team India, MS dhoni, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, teamindia, bangladesh, second one day, Sher-e-Bangla National Stadium, Mirpur bangladesh, Sports, Shikhar Dhawan,Ajinkya Rahane, Ambati rayudu, Sher-e-Banglam harbajan singh, MS Dhoni, Mahendra Singh Dhoni, captaincy, india tour of bangladesh 2015, Ravichandran Ashwin, India vs Bangladesh

Nasir Hossain is back in the attack with is part-time off spin. More of the same from him, keeps it slow and tight on the stumps. Dhoni's brings out the afterburners in his shoes as he completed a double in no time, off the last ball in that over.

రెండో వన్డేలోనూ తడబడుతున్న భారత్.. 30 ఓవర్లకు 142-4

Posted: 06/21/2015 04:35 PM IST
Bangladesh have chance to seal first ever series against india

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకున్న టీమిండియా.. పరుగలు వేటలో తడబడుతోంది. గత వన్డే మ్యాచ్ మిగిల్చిన ఓటమి గాయం నుంచి కోలుకుని రాణిస్తారనుకున్న ధోని సేన.. పరుగుల కోసం అపసోపాలు పడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దోనిసేన.. 30 ఓవర్లు ముగిసే సరికి 142 పరుగులు మాత్రమే సాధించి.. నాలుగు విక్కెట్లను కోల్పయింది. ప్రస్తుతం క్రీజ్ లో వున్న వంద పరుగుల లక్ష్యాన్ని అతి కష్టంగా చేధించిన టీమిండియా.. ఈలోపు టాప్ ఆర్డర్ కు చెందిన నాలుగు విక్కెట్లను పోగొట్టుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండానే డకౌట్ గా వెనుదిరడంతో భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది.

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 22 పరుగలు మాత్రమే చేసి వెనుదిరగడంతో టీమిండియా రెండో విక్కెట్ కోల్పోయింది. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన అంబటి రాయుడు పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 54 పరుగుల వద్ద ఔటయ్యాడు... సూపర్ ఫామ్ లో వున్న అజ్యింక రహానేను ఈ మ్యాచ్ ను తప్పించిన కెప్టెన్ ధోని ఆయన స్థానంలో అంబటి రాయుడికి స్థానం కల్పించారు. అయితే ధోని అంచనాలు తలకిందులై.. అంబటి రాయుడు పెద్దగా స్కోరు సాధించకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో జట్టు సారధి మహింద్ర సింగ్ ధోణి, 32 పరుగులతో రాణిస్తుండగా, సురేష్ రైనా 24 పరుగులతో అడుతున్నారు.

బంగ్లా బౌలర్లు నాసిర్ హుస్సన్ కు రెండు వికెట్లు లభించగా, ముస్తాఫిజుర్ రెహమాన్, రుబెల్ లకు చరో విక్కెట్ లభించింది. కాగా అటు బౌలింగ్ లోనూ ధోని పలు మార్పులు చేశాడు. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మల స్థానంలో అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణిలకు జట్టులోకి తీసుకున్నారు. మూడు వన్డలే సీరిస్ లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో గెలిచి 1-1తో స్కోరును సమం చేసుకోవాలని రంగంలోకి దిగిన ధోనిసేన ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలవాల్సింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన నేపథ్యలో సీరిస్ బంగ్లాదేశ్ వశం అవ్వడం ఖాయం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : teamindia  bangladesh  second one day  Sher-e-Bangla National Stadium  Mirpur  

Other Articles