Flooded Rivers Create Havoc, low Pressure to Bring More Rain

Heavy rains throw life out of gear in andhra and telangana

Low Pressure Over Bay of Bengal, Rain to Andhra pradesh, Weather Forecast in AP, heavy rain in AP, Rain to Telangana, Weather Forecast in Telangana, heavy rain in Telangana, heavy rains lashes in AP, Telangana, low depression in bay of bengal, rain to odisha, low depression off coast in puri

A well-marked low pressure area over the Bay of Bengal near northern Andhra Pradesh and southern Odisha coast bring heavy to very heavy rain over Coastal Andhra Pradesh and the southern coast of Odisha.

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షంతో క్షణక్షణం గండం..

Posted: 06/21/2015 03:10 PM IST
Heavy rains throw life out of gear in andhra and telangana

ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలతో పాటు తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలను హడలెత్తిస్తున్న వాయుగుండం.. కోస్తా తీర ప్రాంత వాసులకు క్షణక్షణం గండంగా మార్చుతూ తీరాన్ని దాటింది. పూరి-గోపాలపూర్‌ మధ్య వాయుగుండం తీరం దాటిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పూల్ బనికి 9 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని పేర్కోంది. వాయుగుడం క్రమేపి బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం వుందని పేర్కోంది.

ఫలితంగా గంటకు 45-55 కిలోమీటర్ల వేంగంతో ఉత్తరకోసత్ాలో, 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాలో ఈదరుగాలులు వీస్తాయని వివరించింది. దీంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కోంది. కొస్తాతో పాటుగా తెలంగాణలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 20 సెం.మీల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. అయితే సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు  వెళ్లరాదని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : low depression  Heavy rains  forecast  Andhra pradesh  Telangana  

Other Articles