Centre announces more funds for Jammu and Kashmir

Jaitley rajnath scotches speculation supports sushma

Finance Minister Arun Jaitley, home Minister Rajnath singh, External Affairs Minister Sushma Swaraj, lalith modi issue, Sushma Swaraj, Arun Jaitley, revanth reddy, chandra babu naidu, cash for vote scam, rajnath singh, latit modi visa controvrsary row, british travel document, narendra modi

Union Ministers Arun Jaitley and Rajnath singh came out in defence of Sushma Swaraj, who is embroiled in a major row over helping former IPL chief Lalit Modi to get UK travel documents.

..అందుకే మేము షుష్మాస్వరాజ్ కు బాసటగా నిలిచాం

Posted: 06/16/2015 10:10 PM IST
Jaitley rajnath scotches speculation supports sushma

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ విషయంలో మానవత్వంతో స్పందించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు బాసటగా నిలిచామని సహచర కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్లు వ్యాఖ్యానించారు. మంచి పనులు చేసినవారిని అందరూ అభినందించినట్లే తాము కూడా సుష్మాకు అండగా నిలవడంతో విచిత్రమేముందని వారు ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్కు రూ. 2,437 కోట్ల వరద సాయం ప్రకటించిన అనంతరం మంత్రులు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. సుష్మాస్వరాజ్ మంచి ఉద్దేశంతో వ్యవహరించినందునే పార్టీ, ప్రభుత్వాలు ఆమెకు అండగా నిలిచాయన్నారు. లలిత్ మోదీకి సంబంధిచిన పలు కేసులను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేసిందని, వాటిలో చాలావాటికి షోకాజ్ నోటీసులు కూడా జారీచేసిందని గుర్తుచేశారు.

 కాగా, మీడియా సమావేశానికి ముందు రాజ్నాథ్, జైట్లీలు సుమారు గంటపాటు సుష్మా సర్వరాజ్తో భేటీ అయ్యారు. గత ఏడాది జనవరిలో సంభవించిన భారీవరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన జమ్ముకశ్మీర్ ను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు అన్నారు. ఆ క్రమంలోనే రూ. రూ. 2,437 కోట్ల వరద సాయాన్ని ప్రకటించారు. గతేడాది అందించిన రూ. 2,602 కోట్లకు ఇది అదనం. 'ప్రస్తుతం కశ్మీర్లో పీడీపీ- బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కశ్మీర్ అభివృద్ధికి కేంద్రం బాసటగా నిలుస్తుందని కనీస ఉమ్మడి ప్రణాళికలో చెప్పాం. తాజా ఆర్థిక ప్యాకేజీతో కలిపి జమ్ముకశ్మీర్ కు రూ. 5000 కోట్లు అందించాం. అవసరమైతే మరికొంత ఆర్థిక సాయాన్ని ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది' అని రాజ్నాథ్, జైట్లీ పేర్కొన్నారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు నోటు కేసులో తాము మాట్లాడేది ఇక ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న కథనాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే, హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అమలుచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న డిమాండ్ల మీద కూడా రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పరిష్కరిస్తారని రాజ్నాధ్ సింగ్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalith modi issue  Sushma Swaraj  Arun Jaitley  cash for vote scam  rajnath singh  

Other Articles