Sugar babies | sugar daddies | relationship | cambridge university

Students became online sugar daddies into paying their tuition fees

Sugar babies, sugar daddies, relationship, cambridge university, students, teenage girls, seekingarrangements.com

Students became online sugar daddies into paying their tuition fees There was a time when undergraduates would pull pints or get a job on a supermarket checkout to pay their way through university. But the increase in fees to £9,000 a year has seen a rise in young women shunning traditional jobs and turning to so-called sugar daddies to pay for their tuition, a documentary will claim.

ITEMVIDEOS: ఆ అమ్మాయిలు షుగర్ బేబీలు.. ఏం చేస్తారంటే

Posted: 06/16/2015 04:26 PM IST
Students became online sugar daddies into paying their tuition fees

చదువుకుందామని ఎంత ఆశ ఉన్నా కానీ చదువుకునే స్థోమత లేక.. చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. అయితే ఫారెన్ లోని చాలా గొప్ప యూనివర్పిటీల్లో చదువుకునే చాలా మంది విద్యార్థులు తమ యూనివర్సిటీ ఫీజుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి అంశంమే అందరిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఇక్కడ టీనేజ్ అమ్మాయిలు తమ అవసరాలను తీర్చి, లక్సరీ లైఫ్ ను అందించే వారి కోసం ఎదురుచూడక్కర్లేదు. ఆన్ లైన్ లో ఓ వెబ్ సైట్ లో తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. హై ప్రొఫైల్ వ్యక్తులు మీకు దగ్గరవుతారు. అయితే వారితో అమ్మాయిలు రిలేషన్ షిప్ కొనసాగించాలి. ముక్కు మొహం తలియని వారితో ఎలా రిలేషన్ షిప్ కొనసాగిస్తారు అనుకుంటున్నారేమో...? దానికి వెబ్ సైట్ ది బాధ్యత. అన్ని వివరాలను సేకరించి, అటు అమ్మాయికి, ఎవరైతే అమ్మాయితో రిలేషన్ షిప్ చెయ్యాలని అనుకుంటున్నారో వారి మధ్య ఓ అగ్రిమెంట్ చేస్తారు. అలా అగ్రిమెంట్ ప్రకారం వారు నడుచుకుంటారు. అయితే ఇలా అగ్రిమెంట్ చేసుకున్న అమ్మాయిలను షుగర్ బేబీస్ అని, అమ్మాయిలతో రిలేషన్ షిప్ చేసేవారిని షుగర్ డ్యాడీస్ అని అంటారు. అసలు మొత్తం షుగర్ బేబీలు, షుగర్ డ్యాడీ కథ తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.  

ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ఫేమస్ యూనివర్సిటీల్లో చదవాలని ఎదరికైనా కోరిక ఉంటుంది. అయితే అక్కడ ఫీజులు మాత్రం మోత మోగుతుంటాయి. అయితే చదువు ఎంత భారమైనా కానీ చదవాలనుకే అమ్మాయిల కోసమే ఈ షుగర్ బేబీస్ కాన్సెప్ట్. ఇందులో సీకింగ్ అరేంజ్ మెంట్స్ డాట్ కామ్(seekingarrangements.com) సైట్ షుగర్ బేబీస్ అనే కాన్సెప్టు తీసుకువచ్చి.. అందులో చదువుకునే అమ్మాయిలు రిలేషన్ షిప్ కొనసాగించడానికి సిద్దంగా ఉన్న వారు రిజిస్ట్రేషన్ చేసకోవాలి.ఇలా రిజిస్టర్ అయిన అమ్మాయిలకు హై ప్రొఫైల్ వ్యక్తుల లిస్ట్ పంపుతారు. వారు అందులో తమకు నచ్చిన వారితో రిలేషన్ షిప్ చెయ్యవచ్చు. అయితే ఇక్కడ రిలేషన్ ఫిప్ అంటే డేటింగ్ అనే కాదు.. కొన్ని సార్లు తమకు నచ్చిన షుగర్ డ్యాడీలతో శృంగారం కూడా చెయ్యవచ్చు. అయితే అందుకు ప్రతిఫలంగా అమ్మాయిలకు తగిన గిఫ్ట్ లు, యూనివర్సిటి ఫీజులు, అనుకోని సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఉంటాయి. అసలే హై ప్రొఫైల్ వ్యక్తులు కాబట్టి అమ్మాయిలను వారే ప్రమోట్ చేస్తారని కూడా నమ్మకం.

sugar-babies-website

అయితే ఇలా స్టూడెంట్స్ బహిరంగంగా అన్నింటికి సిద్దపడటంపై కొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. అయితే ఇది హైఫై వ్యభిచారం అని కొందరు. స్టూడెంట్స్ ను ఇలా వ్యభిచారానికి ప్రేరేపిస్తారా అని కొందరు మండిపడుతున్నారు. అయితే దీనిపై అమ్మాయిలు మాత్రం మరోలా అంటున్నారు. నెలకు మూడు నుండి నాలుగు వేల పౌండ్లు సంపాదిస్తున్నామని, వేరే ఏ జాబ్ చేసినా ఇలా గిఫ్ట్ లు హాలీడేస్ ఉండవని, పైగా కాలేజ్ కు బంక్ కొట్టకుండానే సంపాదించవచ్చు కదా అని అంటున్నారు. అయితే రిలేషన్ ఫిప్ చేస్తున్న వారందరితోనే శృంగారం జరపాల్సిన అవసరం లేదని, ఓ అమ్మాయి అంటోంది. తాను తొమ్మిది మందితో రిలేషన్ షిప్ మెంటెన్ చేస్తున్నానని, కానీ కేవలం ఒకరి వద్ద మాత్రమే శృంగారం చేసానని, అది కూడా తన ఇష్టంతోనే అంటోంది. మరి ఇంత ఫెసిలిటి ఉన్నప్పుడు వాడుకోకపోతే ఎలా అని చాలా మంది అమ్మాయిలు షుగర్ బేబీలుగా మారుతున్నారట. ఈ రకంగా 139 దేశాల్లో 4.5 మిలియన్ల మంది షుగర్ బేబీల కోసం సైట్ ను విజిట్ చేస్తున్నారట. మొత్తానికి అటు సంపాదన, ఇటు లక్సరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు అమ్మాయిలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles