Yoga, australia, perth studio, melissa, yoga class, women

Western australia is joining the rising number of studios hosting nude yoga classes for women

Yoga, australia, perth studio, melissa, yoga class, women

Western Australia is joining the rising number of studios hosting nude yoga classes for women, with a mission to help them love not judge their bodies. ‘My teacher Rosie Rees came to me about six months ago with the idea and we decided Perth was ready for it,’ studio owner Melissa Howard .

యోగా.. యోగా.. బట్టలు లేకుండా చెయ్యగా

Posted: 06/16/2015 03:41 PM IST
Western australia is joining the rising number of studios hosting nude yoga classes for women

యోగా... ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్నది కూడా ఇదే అంశం. అయితే వరల్డ్ యోగా డేకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం జరిగే యోగా డేకు ప్రపంచ మొత్తం ఏర్పాట్లలో మునిగిపోయింది. అయితే తాజాగా ఓ యోగా మాత్రం అందరి దృష్టిలో పడింది. ఏంటా అనుకుంటున్నారా..? యోగా చెయ్యడం మామూలే కానీ అదే నగ్నంగా యోగా చేస్తున్నారు అంటే అది వార్తే కదా. తాజాగా యోగా డే సమీపిస్తున్న నేపథ్యంలో పెర్త్ స్టూడియో న్యూడ్ యోగా(నగ్నంగా యోగా) పేరుతో యోగా ను ప్రారంభించింది. అయితే ఇందులో ఏ వయస్సు వాళ్లైనా, ఎవరైనా సరే ప్రాక్టీస్ చెయ్యవచ్చు. అయితే ఇలా నగ్నంగా చేస్తున్న యోగాలో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉండటం విశేషం.

ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టూడియోలో తాజాగా న్యూడ్ యోగా స్టార్ట్ చేశారు. అంటే నగ్నంగా.. ఒంటి మీద నూలు పోగు లేకుండా యోగా చెయ్యడం అన్నట్లు. అయితే మెలీసా అనే ఆవిడ ఈ న్యూడ్ యోగాను ప్రారంభించారు. అయితే ప్రారంభంలో కాస్త వింతగా అనిపించినా ఇప్పుడు మాత్రం చాలా మంది ఈ యోగా క్లాసులకు వస్తున్నారు. అయితే ఈ యోగా క్లాసులకు వస్తున్న వారిలో 23 ఏళ్ల అమ్మాయి దగ్గరి నుండి 50 ఏళ్ల మధ్య వయస్కురాలి వరకు ఉన్నారు. వారానికి మూడు రోజులు జరిగే క్లాసుల్లో చాలా మంది రిలాక్స్ ఫీలవుతున్నారట. ప్రారంభంలో ఆడవాళ్లు ఏడుస్తున్నారని, దాని అర్థం వారి మానసిక వత్తిడి దూరమవుతోందని అంటున్నారు నిర్వాహకురాలు. మొత్తానికి ఇది చూసేవాళ్లకు కాస్త వింతగానే, చేసే వాళ్లకు రిలాక్స్ గానూ, నిర్వహిస్తున్న వారికి కాసుల పంటగానూ కనిపిస్తోంది. అందరికి స్వేచ్చ ఉంది మరి దీన్ని మాత్రం ఎలా కాదనగలం అంటూ చాలా మంది మేధావులు కూడా న్యూడ్ యోగాను ఎంకరేజ్ చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga  australia  perth studio  melissa  yoga class  women  

Other Articles