Story of an auto-driver who became an Indigo commercial pilot

Inspirational story of shrikant pantawane auto driver turned pilot

auto driver turned pilot, IndiGo, IndiGo pilot, Airlines, Aviation, Shrikant Pantawane, DGCA, DGCA pilot scholarship program, Auto Driver, Airline Pilot, indigo airlines

There's a new man on IndiGo's pilot roster. And it's not just any ordinary man. From driving a three-wheeled auto rickshaw to flying an aircraft - which also ironically is three-wheeled - Shrikant Pantawane's story is a fascinating one - stuff that dreams are made of.

కృషితో నాస్తి దుర్భిక్షం... పైలెట్ గా మారిన ఆటోవాలా..

Posted: 06/15/2015 08:29 PM IST
Inspirational story of shrikant pantawane auto driver turned pilot

ఆటోవాలా.. ఫైలట్ అయ్యాడు. ఆటోకు, విమానానికి పెద్ద తేడా ఏముంది. రెండింటికీ మూడే చక్రాలు ఉంటాయి అంటారా..? కావచ్చు కానీ ఆటోను నడపడం తేలిక.. అదే విమానాన్ని గగనవీధుల్లో నడిపించడమంటే.. ఎంతో శ్రమ, ఏకాగ్రత, సమయస్పూర్తి, సహనం ఇత్యాదులు కలిగివుండాలి. అందుకనే అటో డ్రైవర్.. పైలట్ కావడమన్నది అసాధారణ విషయం. కానీ అలాంటి అసాధరణ విషయాన్ని కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ.. చేసి చూపించిన శ్రీకాంత్ పంటవానె యువతకు ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన శ్రీకాంత్ ఇండిగో ఎయిర్ లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ స్ఫూర్తి కథనాన్ని ఇండిగో ట్విటర్లో వెల్లడించింది. ఇండిగో మేగజైన్లో కూడా ఈ కథనం ప్రచురితంకానుంది.

శ్రీకాంత్ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డు. దీంతో సంపాదన కోసం శ్రీకాంత్ చిన్నతనం నుంచే ఏదో ఒకపని చేసేవాడు. స్కూలు రోజుల్లో చదువుకుంటూ డెలివరీ బాయ్గా పనిచేశాడు. ఆ తర్వాత ఆటోను నడిపాడు. శ్రీకాంత్కు టీ స్టాల్ నడిపే వ్యక్తితో ఏర్పడిన పరిచయం అతని జీవితంలో మార్పు తెచ్చింది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ పేద విద్యార్థుల కోసం పైలట్ స్కాలర్షిప్ పథకం అందిస్తున్నట్టు ఆయన ద్వారా శ్రీకాంత్ తెలుసుకున్నాడు. చదువులో చురుగ్గా ఉండే శ్రీకాంత్ స్కాలర్షిప్ సాధించి మధ్యప్రదేశ్లో ఫ్లైయింగ్ స్కూల్లో శిక్షణ పొందాడు. స్కూల్లో శ్రీకాంత్ టాపర్గా ఉండేవాడని ఇండిగో వెల్లడించింది. శ్రీకాంత్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినా.. విమానయాన రంగంలో సంక్షోభం కారణంగా కొంతకాలం ఉద్యోగం కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. శ్రీకాంత్ చివరకు తన కలను సాకారం చేసుకున్నాడు. ఇండిగో ఎయిర్లైన్స్లో పైలట్గా చేరాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shrikant Pantawane  Auto Driver  Airline Pilot  indigo airlines  

Other Articles