Revanth Reddy | Remand | Extend | Udayasimha | Sebastian | cash for vote

Revanth reddy remand extend for this month 29

Revanth Reddy, Remand, Extend, Udayasimha, Sebastian, cash for vote, Telangana

Revanth Reddy remand extend for this month 29. The ACB court order to extend the Revanth Reddy and two others remand.

రేవంత్ రెడ్డి విడుదల లేదు.. 29 వరకు రిమాండ్

Posted: 06/15/2015 12:22 PM IST
Revanth reddy remand extend for this month 29

ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి బయటకు వెళ్లడం మంచిది కాదని, కేసులో కీలక సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలంగాణ ఏసీబీ అధికారుల తరఫున లాయర్ వాదించారు. గతంలో రెండు వారాల రిమాండ్ విధించిన కోర్టు తాజాగా ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో రేవంత్ అభిమానులకు ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు వ్యవహారంలో కీలకమైన ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన నేపధ్యంలో ఆ నివేదిక రావడానికి ఇంకా సమయం పడుతుందని కాబట్టి అప్పటి దాకా రేవంత్ రెడ్డిని విడుదల చెయ్యకూడదని ఏసీబీ తరఫు లాయర్లు వాదించారు. రేవంత్ రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్ లకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడగించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Revanth Reddy  Remand  Extend  Udayasimha  Sebastian  cash for vote  Telangana  

Other Articles