Telangana | cash for vote | ACB | KCR | Chandrababu | RevanthReddy

Telangana state acb officers moving fast on cash for vote scandal

Telangana, cash for vote, ACB, KCR, Chandrababu, RevanthReddy

Telangana state ACB officers moving fast on cash for vote scandal. ACB waiting for Stephen son statement on cash for vote scandal. The ACB oficers may file more cases on this scandal.

ఏసీబీ దూకుడు.. స్టీఫెన్ సన్ వాంగ్మూలమే కీలకం

Posted: 06/13/2015 08:28 AM IST
Telangana state acb officers moving fast on cash for vote scandal

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ వేగంగా కదులుతోంది. కేసులొ కీలకమైన స్టీఫెన్ సన్ వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత కేసును మరింత వేగంగా కదిలించేందుకు ఏసీబీ అధికారులు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంతో కీలకంగా ఉన్న ఆడియో, వీడియో టేపులను ఏసీబీ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే కేసులో స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఎంతో కీలకం కానుంది. తన వాంగ్మూలంలో స్టీఫెన్‌ ఎవరెవరి పేర్లు వెల్లడించనున్నారు? ఏ విషయాలు బహిర్గతం చేయనున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాంగ్మూలం సేకరించిన తర్వాత సంబంధికులకు నోటీసులు జారీ చేయడం, అవసరమైతే కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. స్టీఫెన్‌సన్‌, రేవంత్‌ రెడ్డి మధ్య చోటు చేసుకున్న సంభాషణల్లో ‘బాస్‌ చెప్పినందుకే’’ అని ఉండటం, ఆ తర్వాత మీడియాకు విడుదలైన టేపుల్లో ఏపీ సీఎం చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెప్పే వీడియోలు, ‘అప్పుడే ఏమైంది అసలు సినిమా ముందుంది’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు సమాచారం.

అయితే ఓ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హస్తముందన్న అనుమానాల నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది. ఏసీబీ అధికారులు గత మూడు నాలుగు రోజుల నుండి ప్రభుత్వం, న్యాయనిపుణులతో చేస్తున్న చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్ తర్వాత పెద్ద తలకాయలే బయలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ సమయంలో కేసులో ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా చూడడానికి తెలంగాణ ఏసీబీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. గవర్నర్‌ నరసింహన్‌తో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి శుక్రవారం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. విచారణలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా నుంచి సేకరించిన సమాచారం పై సమగ్ర నివేదికను దర్యాప్తు అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక సమాచారం ఇందులో ఉన్నట్లు సమచారం. మరి తెలంగాణ ఏసీబీ అధికారులు ఏ స్టెప్ తీసుకుంటారో చూడాలి. కేంద్రం తరఫున ఇప్పటికే ట్యాపింగ్ ఫిర్యాదుపై విచారణ ప్రారంభమైన నేపధ్యంలో కేసులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  cash for vote  ACB  KCR  Chandrababu  RevanthReddy  

Other Articles