Ap | Telangana | Umamaheshwar Rao | KCR | Irrigation projects

Ap irrigation minister uma maheshwarrao fired on kcr and his speech

Ap, Telangana, Umamaheshwar Rao, KCR, Irrigation projects

Ap irrigation minister Uma maheshwarRao fired on KCR and his speech. He said that KCR need to clean his mouth before clean the Hussain sagar.

హుస్సేన్ సాగర్ కాదు.. కేసీఆర్ నోటిని శుద్ది చేసుకోవాలి

Posted: 06/13/2015 08:05 AM IST
Ap irrigation minister uma maheshwarrao fired on kcr and his speech

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ఆయన మాట తీరుపై ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు మండినడ్డారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ కంటే ముందు తన నోటిని శుద్ది చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న నీటి ప్రాజెక్టులపై ప్రశ్నించడంలో ఎలాంటి తప్పులేదని అన్నాు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దాన్ని ఏపి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్నట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. విభజన చట్టంలోనే సాగునీటి ప్రాజెక్టులకు సంబందించి క్లీయర్ గా ఉత్తర్వులు ఉన్నాయని, ముందు వాటిని చాలా చదవాలని సలహా ఇచ్చారు. అయినా తాను దొంగ పాస్ పోర్ట్ ల గురించి, దొంగనోట్ల గురించి మాట్లాడలేదని అన్నారు. మాట్లాడే వ్యక్తిని బట్టి సంస్కారం ఉంటుందని అన్నారు.

ఏపి మంత్రి ఉమా మహేశ్వర్ రావు స్పీచ్ హైలెట్స్..

* కేసీఆర్‌.. హుస్సేన్‌ సాగర్‌ను నువ్వు శుద్ధి చేయటం కాదు! ముందు నీ నోటిని శుద్ది చేసుకో!
* సోయలో ఉండే మాట్లాడుతున్నావా? ఆడా, మగా...ఏం భాష మాట్లాడుతున్నావు ?
* నువ్వొక ముఖ్యమంత్రివి. అదే టీఆర్‌ఎస్‌ అధ్యక్షునిగా మాట్లాడి ఉంటే.. నీ కంటే ఎక్కువ మాట్లాడి జనంతో చప్పట్లు కొట్టించుకునే వాడిని  ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్వరంతో అన్నారు.
* ఏపీలోనైనా, తెలంగాణలోనైనా 56 తెలుగు అక్షరాలే ఉంటాయని, వాటిని వాడే సంస్కారం మాట్లాడే వ్యక్తులను బట్టి ఉంటుందని దుయ్యబట్టారు.
* నేనేమీ గల్ఫ్ నకిలీ పాస్‌పోర్టులు గురించి, దొంగనోట్ల గురించి చెప్పలేదే! ఎందుకింత పెత్తందారీ దురహంకారం?
* నువ్వు కట్టే ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించాను.
* సుప్రీం కోర్టులో వేసిన ఎస్‌ఎల్‌పీ గురించిన వాస్తవాలు బయట పెట్టానన్న అక్కసుతో, నీ అసమర్థతను కప్పి పుచ్చుకోవటానికి సంస్కారహీనంగా దూషిస్తావా?’’
* తెలంగాణలో ప్రాజెక్టులను కట్టుకోవద్దని నేను గానీ, మా ప్రభుత్వం గానీ అనడం లేదు.
* రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, డ్యామ్‌లను కాపాడుకోవాలని, ప్రాజెక్టులను కట్టుకోవాలనే కోరుకుంటున్నాం. కాకపోతే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులను కృష్ణా రివర్‌ వాటర్‌ బోర్డు, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ)ల నుంచి పొందాలి. ‘ఆ అనుమతులు తీసుకొన్నారా’ అని మాత్రమే మేం అడుగుతున్నాం. అయినా, మేం అడగటం కాదు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే అలా ఉంది. అందులోభాగంగానే, తెలంగాణలో తలపెట్టిన నూతన ప్రాజెక్టులకు అనుమతులు లేని విషయాన్ని ప్రస్తావించాం’’ అని వివరించారు. ఏపీలోని హంద్రీనీవా, గాలేరు, తెలుగుగంగలకు అనుమతి ఉందా అని కేసీఆర్‌ ప్రశ్నించడంపై స్పందిస్తూ.. ఆ మూడు ప్రాజెక్టులనే కాదు, తెలంగాణ కల్వకుర్తి, నెట్టెంపాడులనూ చట్టంలో పెట్టారని, వాటిపై ఎప్పుడైనా తాను మాట్లాడానా అని ప్రశ్నించారు.
* కోయల్‌సాగర్‌, నెట్టెంపాడులను పూర్తి చేయలేని అసమర్థ కేసీఆర్‌, ఆర్టీఎక్స్‌ , సుంకేసుల ప్రాజెక్టులను అణుబాంబులతో పేలుస్తానని ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
* పట్టిసీమను అనుమతులతో కడుతున్నారా అన్న కేసీఆర్‌ ప్రశ్నను మంత్రి ఉమా తోసిపుచ్చారు. పట్టిసీమ.. పోలవరంలో అంతర్భాగమని, అందుకు అనుమతులూ ఉన్నాయన్నారు.
* కేసీఆర్‌ ఉడత ఊపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Telangana  Umamaheshwar Rao  KCR  Irrigation projects  

Other Articles