Telangana | Financial year | Eetala Rajender | KCR | Watergrid | Kakatiya

Telangana treasury getting financial problems from past two months

Telangana, Financial year, Eetala Rajender, KCR, Watergrid, Kakatiya

Telangana treasury getting financial problems from past two months.The state government which claims it is the only cash-rich state in the country after Gujarat, has been facing financial problems right from the beginning of the financial year. Two months into the FY 2015-16, the income earned through taxes has been witnessing a decline. This is making it difficult for the government to spend on the various programmes listed out in the Budget. The new sops announced by the Chief Minister K. Chandrasekhar Rao to mark the state Formation Day has put further pressure on the finances. No funds were allocated for the sops in the 2015-16 Budget and the finance department is being forced to explore options to mobilise funds.

తెలంగాణ ఖజానాకు కష్టాలు

Posted: 06/11/2015 11:24 AM IST
Telangana treasury getting financial problems from past two months

తెలంగాణ ప్రభుత్వ ఖజానా గురించి మాట్లాడాల్పి వస్తే దేశంలో అధికంగా మిగులు బడ్జెట్ కలిగిన రెండో రాష్ట్రంగా ఉంది. అయితే మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి తెలంగాణ సర్కార్ భారీగా కొత్త పథకాలను ప్రపోజ్ చేస్తూ.. వాటిని అమలు చెయ్యడానికి ముందుకు వస్తోంది. అయితే తెలంగాణ ఖజానా పరిస్థితి ప్రస్తుతం కష్టంగా ఉందట. అవును మీరు చదివింది నిజం, తెలంగాణ సర్కార్ చేస్తున్న పలు కార్యక్రమాలకు నిధులను పూర్తి స్థాయిలోకేటాయించే పరిస్థితిలో ఆర్థిక శాఖ లేదు. అందుకే ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండు బెడ్ రూంల స్కీంకు మొత్తంగా రెండువేల ఐదు వందల కోట్లు, కొత్తగా భర్తీ చెయ్యనున్న ఇరవైఐదు వేల ఉద్యోగాల కోసం తొంభై కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తే అదనంగా తొమ్మిది కోట్ల రూపాయల భారం పడనుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న భారం కాకుండా కొత్తగా మరింత భారం పడనుంది.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ సర్కార్ చేసిన బారీ వ్యయం గురించి కూడా ఈ సందర్థంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించి తెలంగాణ సర్కార్ కష్టాల్లో ఉంది అని వార్తలు రావడంపై ఈటెల రాజేందర్ స్పందించారుే. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై కేవలం రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇంకా పది నెలల టైం ఉన్నందున అలాంటిది ఏమీ లేదని అన్నారు. ఇప్పటికే పన్ను వసూలులో 85 నుండి 90శాతం సక్సెస్ అయిన తెలంగాణ సర్కార్ రానున్న నెల నుండి వంద శాతం వసూలు చేస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మరి దేశంలోనే పెద్ద బడ్జెట్ లను ప్రవేశపెట్టిన రాష్ట్రాల జాబితాలో ఉన్న తెలంగాణ సర్కార్ కు ఇలా కరెన్సీ కష్టాలు రావడం ఏంటో అని కొందరు అనుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Financial year  Eetala Rajender  KCR  Watergrid  Kakatiya  

Other Articles