Revanth Reddy, Engagement, Chandrababu, Rings, Naralokesh, Bhuvaneshwari

Chandrababu couple distribute the engagement rings in revanth reddy daughter engagement function

Revanth Reddy, Engagement, Chandrababu, Rings, Naralokesh, Bhuvaneshwari

Chandrababu couple distribute the engagement rings in Revanth Reddy daughter engagement function. Chandrababu naidu and his family members nara lokesh, Bhuvaneshwari attend the Revanth Reddy function.

ITEMVIDEOS: చంద్రబాబు చేతులమీదుగా నిశ్చితార్థ ఉంగరాలు

Posted: 06/11/2015 12:59 PM IST
Chandrababu couple distribute the engagement rings in revanth reddy daughter engagement function

ఓటుకు నోటు వ్యవహారంలో ప్రస్తుతం కస్టీడీ ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి తెలుగుదేశం పార్టీ అదినేత, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి, కొడుకు నారా లొకేష్ లు కూడా హాజరయ్యారు. ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడకు రేవంత్ తరఫు బంధువులు స్వాగతం పలికారు. నిశ్చితార్థానికి వచ్చిన వాళ్లతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో కేవలం నవ్వుతూ పలకరించారు. చంద్రబాబు నాయుడు పక్కనే సోఫాలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఫోటోలకు ఫోజులిచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు  దంపతుల తుల మీదుగా నిశ్చితార్థ ఉంగరాలు కాబోయే వధూవరులకు అందించారు. రేవంత్ కూతురు నైమిషారెడ్డి, రేవంత్ అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఉంగరాలు మార్చుకున్నారు.

రేవంత్ కూతురు నిశ్చితార్థం పూర్తిగా నిఘా నీడలో సాగింది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరితోనూ మీట్ కాకపోవడమే కాకుండా ఫోన్ కూడా మాట్లాడేందుకు కోర్టు అనుమతించలేదు. రేవంత్ చుట్టూ ప్రత్యేక పోలీసులు ఎస్కార్ట్ గా ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ ఎంట్రెన్స్ దగ్గరి నుండి లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరి మీద.. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వారి కదలికల మీద పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, లోకేష్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలు, కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్ తదితరులు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Engagement  Chandrababu  Rings  Naralokesh  Bhuvaneshwari  

Other Articles