Revanth Reddy | Release | Bail | Engagement | Charlapalli | TTDP

Revanth reddy released this morning from charlapally jail

Revanth Reddy, Bail, Engagement, Charlapalli, TTDP

Revanth Reddy released this morning from Charlapally jail. Revanth Reddy got bail yesterday for twele hours.

ITEMVIDEOS: బెయిల్ పై రేవంత్ విడుదల

Posted: 06/11/2015 07:59 AM IST
Revanth reddy released this morning from charlapally jail

ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. ఈ ఉదయం చర్లపల్లి జైలు నుంచి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు. కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని కోర్టు ఉత్తర్వులు జారీచేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు.

ఈ ఉదయం ఇంటికి చేరుకొని ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ కు చేరుకుంటారని సమాచారం. జైలు నుండి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డికి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టైగర్ రేవంత్ అన్న నాయకత్వం వర్థిల్లాలి అంటూ అభిమానులు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి మీద పూల వర్షం కురిపించారు. అయితే రేవంత్ కూతురు నిశ్చితార్థానికి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి, కుమారుడు లోకేష్ తో సహా ఏపి, తెలంగాణ కు చెందిన కీలక నేతలు అందరూ పాల్గొంటారు. అయితే రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం అయినా కానీ పెద్దగా సందడి లేకుండా ఉంది. రేవంత్ రెడ్డి మామూలుగానే చాలా హడావిడిగా పంక్షన్ చేసే నేత కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. రేవంత్ కూతురు నిశ్చితార్థం పూర్తిగా నిఘా నీడలో సాగనుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Bail  Engagement  Charlapalli  TTDP  

Other Articles