Chandrababu | KCR | Media | Ap | Telangana | Hyderabad | Tapping

Telangana chief minister kcr said that chandrababu is a thief

Chandrababu, KCR, Media, Ap, Telangana, Hyderabad, Tapping

Telangana Chief Minister KCR said that chandrababu is a thief. Denying that the Telangana government has tapped anybody's phone, Chief Minister K. Chandrasekhar Rao Wednesday said that his Andhra Pradesh counterpart N. Chandrababu Naidu can't escape from law in a cash-for-vote scam.

చంద్రబాబూ.. నా వెంట్రుక కూడా పీకలేవు: కేసీఆర్

Posted: 06/11/2015 07:39 AM IST
Telangana chief minister kcr said that chandrababu is a thief

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద మండిపడ్డారు. ఒకవేళ దొంగకు కేంద్రం సహకరిస్తుంది అనుకుంటే కేంద్రాన్ని కూడా ఎదుర్కుంటామని వెల్లడించారు. చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత జేజమ్మ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం వెంట్రుక కూడా పీకలేరని  అన్నారు. చంద్రబాబును దొరికిన దొంగ అని వర్ణించిన కేసీఆర్.. చంద్రబాబును ప్రధాని నరేంద్రమోదీ సమర్థించరని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని కేసీఆర్ స్పష్టంచేశారు.  రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. దానినుంచి తప్పించుకోడానికి గాయి గాయి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ పై పదేండ్లు తనకు హక్కు ఉందని చంద్రబాబు చెప్పడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇది పదేండ్లు ఫెసిలిటేటింగ్ క్యాపిటల్ మాత్రమేనని గుర్తు చేశారు. కావాలంటే విభజన చట్టాన్ని చదువుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. అహంకారం, అరాచకంతో మాట్లాడున్న చంద్రబాబు ఆటలు సాగబోవని హెచ్చరించారు. ఇక్కడ ఆయన కేవలం ఒక గెస్ట్ సీఎం మాత్రమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

తనను అరెస్టు చేసిన రోజే కెసిఆర్‌ ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని బాబు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ చంద్రబాబు హైదరాబాద్‌లో గెస్ట్‌ చీఫ్‌ మినిస్టర్‌ అని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన పరిధి ఉండదన్నారు. ఆయన ఏమైనా రాష్ట్రపతా..? ఎవరి చరిత్ర ఏమిటో గవర్నర్‌ ఏడాదిగా చూస్తున్నారని అన్నారు. దొరికిన దాని గురించి మాట్లాడకుండా..ఏదెదో మాట్లాడటం వల్ల ఏం ఉపయోగమని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌ పార్టీ కొనుగోలు చేసిందని చెప్పేటప్పుడు చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని కెసిఆర్‌ హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులు చంద్రబాబుకు వర్తించవా అని ప్రశ్నించారు. నీవు చేస్తే నీతి, మేం చేస్తే అవినీతా అని అన్నారు. ఎంపీలు ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీత ఏ పార్టీ తరపున గెలిచారో చెప్పాలన్నారు. ఇప్పుడు వారిద్దరూ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు కోన రఘపతి, గొట్టిపాటి రవికుమార్‌, ముస్తఫా, జలీల్‌ఖాన్‌, ఉప్పులేటి కల్పన, వెంకటరమణ, కృష్ణమోహన్‌లను టిడిపి చేర్చుకుందని అన్నారు. ముగ్గురు కాంగ్రెస్‌, ఆరు వైఎస్సార్‌సిపి ఎమ్మెల్సీలను టిడిపి లాక్కోకోలేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మూడు పార్టీల సహకారం కోరామని, సిపిఎం, సిపిఐ, వైసిపిలను కోరామన్నారు. ప్రిన్సిపుల్స్‌ ప్రకారం సిపిఎం ఓటింగ్‌కు దూరంగా ఉందన్నారు. సిపిఐ పాల్గొనబోమని చెప్పిందన్నారు. వైసిపి సపోర్టు చేసిందన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్కో అభ్యర్థికి 16.54 శాతం ఓట్లు ఉన్నాయని, టిడిపికి 15 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి తమకు పూర్తి ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఓట్లు లేని టిడిపి ఏ రకంగా పోటీ చేసిందో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం చంద్రబాబుకు వర్తించదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం స్పీకర్‌ పరిధిలో ఉందన్నారు.

కేసీఆర్ మాటల్లో హైలైట్స్...

* చంద్రబాబూ.. జస్ట్ నువ్వొక గెస్ట్‌వి..
* దొరికిన దొంగవు.. అహంకారం.. అరాచకం నీదే..
* తెలంగాణలో నీ ఆటలు సాగవు..
* ఫోన్ల ట్యాపింగ్ చేయలేదు.. చెయ్యం
* మెజార్టీ లేకుండా పోటీకి దిగడం వెనుక బాబు ప్లానేంది?
* దొంగకు కేంద్రం సహాయం చేస్తుందని అనుకోను
* చంద్రబాబు ఆయనను ఆయనే మసిజేసుకున్నడు
* చంద్రబాబు బాగోతం చెప్తే పరేషాన్ అయితరు
* ఇప్పుడు చెప్ప.. టైమొచ్చినప్పుడు చెప్త
* రాజీ జరగడానికి మాకేం పంచాయతీ ఉంది?
* కేంద్ర నుంచి ఎవరూ నాకు ఫోన్ చేయలేదు
* ఓటుకు నోటు కేసులో ముందుకే
* ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు
* కేంద్రం అండగా నిలిస్తే ధైర్యంగా ఎదుర్కొందాం

 

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  KCR  Media  Ap  Telangana  Hyderabad  Tapping  

Other Articles