Marry 3 wives to overcome water crisis | Bundelkhand Magistrate | BK Pandey | Water Problems

Marry 3 wives to overcome water crisis bundelkhand magistrate bk pandey

water crisis, bundelkhand megistrate, bundelkhand water problems, bk pandey controversial statements, 3 wives marriages, water problems solutions

Marry 3 wives to overcome water crisis Bundelkhand Magistrate BK Pandey : Mr. B. K. Pandey, Sub-Divisional Magistrate (SDM) while addressing a meeting at Lidhora village on Monday suggested the people to marry 3 wives to overcome water crisis

నీళ్లకోసం మూడు పెళ్లిళ్లు చేసుకోక తప్పదా?

Posted: 06/10/2015 12:19 PM IST
Marry 3 wives to overcome water crisis bundelkhand magistrate bk pandey

ప్రస్తుతకాలంలో నీటిసమస్య ఎంతో ఎక్కువగా వుంది. రానున్నరోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. నీటిశాతం పూర్తిగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో అయితే త్రాగడానికి కాదుకదా.. కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా నీళ్లు దొరక్క  ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తనదైన సలహా ఇచ్చారు. నీటి సమస్య ఎక్కువగా వుంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే పరిష్కారం లభిస్తుందని ఆయన ఉచిత సలహా ఇచ్చారు.

మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈ విధంగా నీటి సమస్యపై సరికొత్త పరిష్కారం సూచించారు. ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని, వాళ్లలో ఒకళ్లు పిల్లలను కంటే, మిగిలిన ఇద్దరు నీళ్లు తెస్తారని జతారా ఎస్డీఎం బీకే పాండే ఉచిత సలహా ఇచ్చారు. ఒకనాడు తాను బైర్వార్ గ్రామం మీదుగా వెళుతున్నప్పుడు.. రాత్రి 2 గంటల సమయంలో కూడా కొందరు మహిళలు నీళ్లు తెచ్చుకోవడం చూశానని, అది చూసి తనకు చాలా బాధేసిందని ఆయన అన్నారు. అప్పుడు తనకు ఆ గ్రామంలో నీటి సమస్య ఏమేరకు వుందో తెలిసిందని.. మహిళలు ఇలా రాత్రివేళల్లో నీళ్లకోసం వెళితే అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం వుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సమస్యను అధిగమించాలంటే.. భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు మంచినీళ్లు కావాలనుకుంటే ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. అంతగా డబ్బు లేనివాళ్లు మాత్రం మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే భరించడం కష్టం అవుతుందని తనదైన శైలిలో జాగ్రత్తలు కూడా చెప్పారు. మరి.. నీళ్లకోసం ఈయన ఇచ్చిన ఈ ‘మూడు పెళ్లిళ్ళ’ ఉచిత సలహా సమంజసమేనా? అని అంతా చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా వుంటూ వస్తోంది. బుందేల్ఖండ్ ప్యాకేజి కింద వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. గడిచిన నెలలో వీధిపంపు వద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మరణించింది. నీళ్లకోసం నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : water crisis  bundelkhand megistrate  

Other Articles