Bail | Revanth Reddy | Engagement | Revanth Daughter

May revanth reddy get bail for one day

Bail, Revanth Reddy, Engagement, Revanth Daughter, ACB

may Revanth Reddy get bail for one day. The hearing started in the court. ACB also didnt express any objection for one day bail.

రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ..?

Posted: 06/10/2015 11:55 AM IST
May revanth reddy get bail for one day

తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత, ప్రస్తుతం ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ చేత ఇంటరాగేషన్ ఎదుర్కొన్న రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ పై హియరింగ్ నడుస్తోంది. ఓటుకు నోటుకు వ్యవహారంలో అరెస్టయిన రేవంత్ రెడ్డికి బెయిల్ కోసం ఎంతో ప్రయత్నాలు సాగుతున్నా ఇప్పటి వరకు మాత్రం బెయల్ దొరకలేదు. అయితే రేవంత్ కూతురు నిశ్చితార్థం రేపే కావడంతో కనీసం మధ్యంతర బెయిల్ కోసం రేవంత్ తరఫున లాయర్లు కోర్టును కోరారు. కాగా దీనిపై ఏసీబీ కూడా ఎలాంటి అడ్డుచెప్పడం లేదు. కానీ బెయిల్ మీద విడుదల తర్వాత మాత్రం సభలు, సమావేశాలు జరపడానికి మాత్రం వీలుకల్పించకూడదలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. బెయిల్ కోసం ముందు నుండి ప్రయత్నాలు సాగుతున్న ఎలాంటి ఫలితం రాకపోవడంతో కనీసం నిశ్చితార్థం కోసం మధ్యంతన బెయిల్ సంపాదించాలని రేవంత్ బంధువులు కోరినట్లు సమాచారం. అయితే బెయిల్ పిటిషన్ తో పాటుగా రేవంత్ కూతురి నిశ్చితార్థ శుభలేఖను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది.

మరోపక్క రేవంత్ ఇంట్లో సందడి మొదలైంది. ఇప్పటికే రేవంత్ ఇంటికి చేరుకున్న బంధువులు అన్ని పనులను ముందుండి చూసుకుంటున్నారు. కాగా రేవంత్ భార్య గీత బెయిల్ మీద చాలా ఆశగా ఉన్నారు. బంధువులతోనూ అదుే విషయం చెబుతున్నారు. బెయిల్ ఖచ్చితంగా వస్తుంది.. నిశ్చితార్థానికి హాజరవుతారని బంధువులతో అంటున్నారు. ఇక రేవంత్ బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టు లాయర్లు రంగంలోకి దిగారు. మొత్తానికి ఏసీబీ కూడా మధ్యంతర బెయిల్ కు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. అయితే అంతా చూడడానికి అలాగే అనిపిస్తున్నా కానీ మధ్యలో ఏదైనా ట్విస్ట్ ఉందా అని కొంత మంది అనుమాన పడుతున్నారు కూడా. మరి రేవంత్ రెడ్డి బయటకు వస్తారా..? లేదా కస్టడీలోనే కొనసాగుతారా..? అన్న విషయం మరికొద్దిసేపట్లో తెలుస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bail  Revanth Reddy  Engagement  Revanth Daughter  ACB  

Other Articles