Narachandrababumaidu | Rajnasthsingh | Tapping | Delhi

Narachandrababu naidu will meet central home minister rajnathsingh and discuss about the phone tapping in telugu states

Narachandrababumaidu, Rajnasthsingh, Tapping, Delhi

Narachandrababu Naidu will meet Central home minister Rajnathsingh and discuss about the phone tapping in telugu states. Chandrababu naidu went to delhi to conclude the phone tapping issue.

చంద్రబాబు చక్రం తిప్పుతాడా..?

Posted: 06/10/2015 09:40 AM IST
Narachandrababu naidu will meet central home minister rajnathsingh and discuss about the phone tapping in telugu states

గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గడ్డు కాలం నడుస్తోంది. ఓటుకు నోటుకు వ్యవహారంలో చంద్రబాబు వాయిస్ తో విడుదలైన ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి దగ్గరి నుండి కీలక సమాచారం సేకరించి, చంద్రబాబు మీద కేసుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తారంటూ అప్పుడే పుకార్లు వస్తుండటంతో తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేగింది. అయితే నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో పాటు మరికొంత మంది మంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర టెలికాం మంత్రి విచారణ జరిపించాలని కోరారు. అలా కేంద్రం స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను సెటిల్ చెయ్యాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరికొందరు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఇప్పటికే ఏపి ఇంటలిజెన్స్ ఆధారాలు కూడా సేకరించిందని సమాచారం. ఆ సాక్షాలతో కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని వెలుగులోకి తేవాలని చంద్రబాబు తనదైన స్టైల్ లో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు కేంద్రంలో రింగ్ తిప్పుతారో లేదా కేసీఆర్ చేత బోనులోకి తోయబడతారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababumaidu  Rajnasthsingh  Tapping  Delhi  

Other Articles