Ap | Tapping | Telangana | equipment | Intelligence

Ap intelligence officers conform the phone tapping

Ap, Tapping, Telangana, equipment, Intelligence

Ap Intelligence officers conform the phone tapping. The ap Intelligence officers clear that telangana govt tapped nearly 120 phones with most latest equipments.

ఫోన్ ట్యాపింగ్ నిజమే

Posted: 06/10/2015 08:26 AM IST
Ap intelligence officers conform the phone tapping

నారా చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది ఏపి మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఏపి ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆడియో టేపులతో ట్యాపింగ్ దుమారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అయితే ఫోన్ల ట్యాపింగ్ వార్తలు నిజమేనని, వెంటనే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఏపి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపి క్యాబినెట్ తమ భవిష్యత్ ప్రణాళికలపై మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అవి..1. ట్యాపింగ్‌పై ఏపీ సర్కారు నేరుగా టి- సర్కారుపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవడం. 2. కేంద్రానికి ఫిర్యాదు చేసి, కేంద్రం ద్వారా విచారణ చేయించడం. 3. ఇది రెండు రాషా్ట్రల మధ్య వివాదం కావడంతో నేరుగా సుప్రీం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం.

అయితే ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడం ద్వారా మొత్తం గుట్టురట్టవుతుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా కొంత మంది మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై కేసు ఫైల్ చేసి గట్టిగా దర్యాప్తు చేస్తే బాగుంటుందని కూడా సూచించినట్లు సమాచారం. మరో పక్క ఫోన్ ట్యాపింగ్ పై ఏపి ఇంటలిజెన్స్ పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి చెందిన 120 మంది నేతల ఫోన్లను టి-పోలీస్‌ అధికారులు ట్యాప్‌ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ ఐజీ అనూరాధ చెప్పినట్లు తెలిసింది. టెలికం కంపెనీల అనుమతితో సంబంధం లేకుండా, నేరుగా ఫోన్లలో సంభాషణలు వినే ఆధునిక యంత్ర పరికరాలను కూడా తెలంగాణ పోలీసులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాంటి యంత్రాలకు అనుమతి లేనప్పటికీ వాటిని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ ఐజీ అనూరాధవివరించారు. కేంద్రం నేరుగా దర్యాప్తు చేపడితే ఇవన్నీ వెలుగులోకి వస్తాయని, టెలికం కంపెనీలూ కేంద్రం అడిగితే పూర్తి వివరాలు ఇస్తాయని చెప్పారు.మరి ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Tapping  Telangana  equipment  Intelligence  

Other Articles