Rashtrapati Bhawan| BSF posts | indo-bangla border | map | undertrial | UP jail

Rashtrapati bhawan map found undertrial in up jail

jailed undertrial, West Bengal, possession of maps, Rajpath and Rashtrapati Bhawan, sketches of BSF posts, Indo-Bangla border, Uttar Pradesh police, eastern state West Bengal, probe the matter,. Rashtrapati Bhawan, BSF posts, indo-bangla border, map, undertrial,UP jail

A jailed undertrial from West Bengal was found in possession of maps related to Rajpath and Rashtrapati Bhawan and sketches of BSF posts on Indo-Bangla border, after which Uttar Pradesh police has sent a team to the eastern state to probe the matter.

కలకలం: అండర్ ట్రయల్ ఖైదీ వద్ద రాష్ట్రపతి భవన్ మ్యాప్..

Posted: 06/09/2015 10:11 PM IST
Rashtrapati bhawan map found undertrial in up jail

ఉత్తర్ ప్రధేశ్ లోని ఓ అండర్ ట్రయల్ ఖైదీ వద్ద రాజ్ పథ్, రాష్ట్రపతి భవన్ కు చెందిన మ్యాప్ లు కలిగివున్న ఘటన కలకలం రేపుతోంది. ఖైదీని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు వాటితో పాటు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఎక్కడెక్కడ బిఎస్ఎఫ్ పోస్టులు వున్నాయన్న స్కెచ్ లు కూడా లభించడంతో అధికారులు విస్తుపోయారు. అండర్ ట్రయల్ ఖైదీ వద్ద ఈ మ్యాఫ్ లను కనుగోన్న అధికారులు అతడి నేర చరిత్రపై ఆరా తీసేందుకు ఖైదీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ కు పోలీసుల బృందాన్ని పంపారు.

ఈ నెల 7వ తేదీన సాధారణ తనిఖీలలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లన్నింటిలో సంబంధిత అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా హత్యా నేరం కేసులో అభియోగాలను ఎదుర్కోంటూ మోరాదాబాద్ జైలులో వున్న సాధిక్ అలి అనే పాతికేళ్ల అండర్ ట్రయల్ ఖైదీ వద్ద నుంచి రాజ్ పథ్, రాష్టపతి భవన్ కు సంబంధించిన మ్యాప్ లు, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఏయే ప్రాంతాల్లో వున్న బిఎస్ఎఫ్ చెక్ పోస్టులు వున్నయన్న విషయాన్ని స్పష్టం చేసే స్కెచ్ లు లభించడంతో జైలు అధికారులు షాక్ తిన్నారు. జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా వున్న సాధిక్ వద్దకు అవి ఎలా వచ్చాయన్న అంశమై ఆరా తీస్తున్నారు.

దేశానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారం అండర్ ట్రయల్ ఖైదీ వద్ద లభించడంతో ఖంగుతిన్న పోలీసులు.. ఖైదీ సోంత రాష్ట్రానికి పోలీసులు బృందాన్ని పంపి కూపీ తీస్తున్నారు. నిందితుడికి ఉగ్రవాదులకు ఏమైనా సంబంధాలు వున్నాయా అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాంబాల్ జిల్లాకు చెందిన వాడని గుర్తించిన పోలీసులు.. 2011లో తన సన్నిహితుడు ఇమ్రాన్ తో గోడవలో అతన్ని హతమార్చినట్లు అభియోగాలపై జైలుకు వచ్చాడు. దీంతో ఖైదీ వద్ద లభించిన ఇతర హిందీ, మంధారిన్, బెంగాళీ బాషల్లోని పలు రచనలను, రెండు సెల్ ఫోన్ లను, రెండు మెమరీ కార్డలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashtrapati Bhawan  BSF posts  indo-bangla border  map  undertrial  UP jail  

Other Articles