BJP leader Yogi Adityanath controversial remarks on 'surya namaskar

Those opposing surya namaskar should drown in sea aditynath

suryanamaskar, islam, muslim law board, yoga day, new delhi, Firebrand, BJP leader Yogi Adityanath, controversy, surya namaskar, drown in the sea

Firebrand BJP leader Yogi Adityanath has stoked a controversy with his remarks that those opposing 'surya namaskar' should "drown in the sea".

స్యూర్య నమస్కారంపై బీజేపి ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 06/09/2015 10:07 PM IST
Those opposing surya namaskar should drown in sea aditynath

ప్రధాని నరేంద్రమోడీ, బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరికలను బిజేపి ఎంపీలు లక్ష్యపెట్టినట్టు కనిపించడం లేదు. సున్నిత అంశాలపై ఎలాంటి వ్యాఖ్యాలు చేయకూడదన్న హెచ్చరికలను తుంగలో కలసిన ఎంపీలు అడపాదడపా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. తాజాగా, బీజేపీ పార్లమెంటు సభ్యుడు. యోగి ఆదిత్యనాథ్ అటాంటి వ్యాఖ్యలే చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారాలను వ్యతిరేకించేవారు ఇళ్ళలో తలుపులు వేసుకుని కూర్చోవాలని, లేదా సముద్రంలో దూకాలని కోత్త వివాదానికి తెరలేపాడు.

ఈ నెల 21న ఢిల్లీలో అంతర్జాతీయ యోగా డే ను పెద్దఎత్తున నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ''సూర్యనమస్కారం' చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయం విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగాలో భాగంగా చేసే "సూర్య నమస్కారం'' ముస్లింలు చేయకూడదని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ముస్లింలకు అభ్యంతరమైన "సూర్య నమస్కారాన్ని'' పాఠశాల యోగాభ్యాసం నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో యోగాసనాల్లో భాగంగా సూర్య నమస్కారం తప్పనిసరిగా ఉంటుందని దానిని వ్యతిరేకించే వారు సముద్రంలో దూకాలని బీజేపి ఎంపీ ఆదిత్యనాథ్ ఆగ్రహంతో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Firebrand  BJP leader Yogi Adityanath  controversy  surya namaskar  drown in the sea  

Other Articles