Narachandrababu | Tapping | Sujanachowdary | Telangana | Revanth Reddy

Is this the tone of cabinet minister tdp mp sujana chowdarys

Narachandrababu, Tapping, Sujanachowdary, Telangana, Revanth Reddy

Is this the tone of cabinet minister,TDP MP Sujana Chowdary's?In conference calls, after closure of the third person talk, the call initiator and receiver will have brief exchange of greetings then close it..

ఆ గొంతు సుజనా చౌదరిదేనా..?

Posted: 06/09/2015 01:03 PM IST
Is this the tone of cabinet minister tdp mp sujana chowdarys

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారం సీరియల్స్ కన్నా ఎక్కువ మలుపులు తిరుగుతోంది. ముందు రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అదికారులు తర్వాత లోతుగా విచారణ ప్రారంభించారు. అయితే స్టీఫెన్ సన్ తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడినట్లు అనుకుంటున్న ఆడియో టేపులు మీడియాకు విడుదలయ్యాయి. దాంతో వివాదం తారా స్థాయికి చేరుకుంది. రెండు రాష్ట్రాల్లో పోటాపోటీ అన్నట్లు ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు స్వయంగా ఓటుకు నోటు వ్యవహారంలో ఉండటంతో వ్యవహారం కీలకంగా మారింది. అయితే మీడియాలో వచ్చిన ఆడియో టేపుల మీద తెలంగాణ అధికారులు లోతుగా ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. అయితే ఆ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఎప్పుడూ వెంటే ఉండే వ్యక్తిదే అంటూ ఓ పోస్ట్ విడుదలైంది.

యా! బ్రదర్, ఔర్ బాబు గారు గోయింగ్ టూ టాక్ టూ యు, బి ఆన్ ది లైన్ ...
గీ గొంతు ఎవరిదీ.....కేంద్ర మంత్రి సుజన చౌదరి గొంతా?
సాదారణంగా కాన్ఫరెన్స్ కాల్స్ లో, మద్య వ్యక్తి మాటలు అయిపోయిన తరువాత మల్ల ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు... అంటే ఇంకా ముచ్చట ఉంది. ఏముంది?

sujana-chowdary-in-that-tap

ఇలా జరిగిన చర్చలో బాబుగారితో మాట్లాడండి అన్నది ఎవరు అంటే అది ఇంకెవరు చంద్రబాబు అనుయాయుడు సుజనా చౌదరి దే అంటూ ఓ పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇది నిజమయ్యే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుతో అంత క్లోజ్ గా మూవ్ అయ్యేది.. ఇలాంటి విషయాలు గుట్టుగా నడిపించగల వ్యక్తి సుజనా చౌదరి అని అందరికి తెలుసు. మరి ఇది ఎంత వరకు నిజమో నిగ్గు తేలాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Tapping  Sujanachowdary  Telangana  Revanth Reddy  

Other Articles