Pawankalyan | AP | Specialstatus

Pawan kalyan once again ready to fight for special status to andhrapradesh

Pawankalyan, Powerstar, janasena, Janasena updates, Janasena news, Janasena feed, Janasena party, Janasena in ap, Janasena pawankalyan, pawankalyan updates, pawankalyan news, pawankalyan with modi, ap, special status, chandrababunaidu, andhrapradesh

Pawan kalyan once again ready to fight for special status to andhrapradesh. janasena Founder Pawan Kalyan likely to fight for announce special status to the andhrapradesh.

పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేనా..?

Posted: 06/09/2015 12:29 PM IST
Pawan kalyan once again ready to fight for special status to andhrapradesh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇక మీదట మరింత క్రియాశీలం కానుంది. అందులో భాగంగానే జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలు చేశారు. చాలా కాలం తర్వాత జనసేన జెండా మళ్లీ జనాల ముందుకు వచ్చింది. అయితే ఇదంతా ఎంతో ప్లాన్డ్ గా సాగుతోందని సమాచారం. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును కావాలనే గెరావ్ చేశారని సమాచారం. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు వెంకయ్య నాయుడు. అలాంటి వెంకయ్య నాయుడుకే జనసేన ఝలక్ ఇచ్చింది. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం వెనుక జరుగుతున్న జాప్యంపై జనసేన కార్యకర్తలు వెంకయ్య నాయుడును నిలదీశారు. రాజీనామా చెయ్యాలని వెంకయ్య నాయుడును డిమాండ్ చేశారు.

అయితే ఏపి రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకోవడానికి వీలులేదంటూ పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించి ఝలక్ ఇచ్చేశారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. అందులో భాగంగానే జనసేన కార్యకర్తలు ఫస్ట్ లుక్ లా ధర్నా నిర్వహించారని సమాచారం. ఇక ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని పవన్ కళ్యాణ్ రంగంలోకి దూకుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే కలిసి ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని, ఇక్కడి పరిస్థితులను కూడా పవన్ వివరించనున్నారట. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు ఏపికి నిధులను తీసుకురావడంలోనే బిజీగా ఉన్నారని కానీ ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా మీద మాత్రం పెద్దగా వర్కవుట్ చెయ్యడం లేదని తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తు కేంద్రం నుండి స్టేట్ మెంట్ విడుదల అయ్యేలా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మరోసారి పవన్ సారి విజృంభిస్తే చాలా మంది గుండెల్లో గంఠా భజాయిస్తుంది అని అప్పుడే సెటైర్లు కూడా వేసుకుంటున్నారట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawankalyan  Powerstar  janasena  ap  special status  chandrababunaidu  andhrapradesh  

Other Articles