cm kcr tongue slips during speech in nalgonda district | revanth reddy controversy | chandrababu naidu

Cm kcr tongue slips during speech in nalgonda district

kcr news, nalgonda district, chandrababu naidu, revanth reddy controversy, kcr speech, chandrababu controversial speech, telangana state, acb attacks

cm kcr tongue slips during speech in nalgonda district : During his speech in nallagonda district.. Kcr tongues slips.

ఆవేశంలో కేసీఆర్ నాలిక మడతబడింది..!

Posted: 06/09/2015 10:19 AM IST
Cm kcr tongue slips during speech in nalgonda district

అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భంలో కొందరు తడబడటం సర్వసాధారణం! ఈ లిస్టులో తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు తరుచూ వినబడుతూనే వుంటుంది. ఎందుకంటే.. ‘మిషన్ కాకతీయ’ను ఆయన ‘కమీషన్ కాకతీయ’ అంటూ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు. సహచర మంత్రులు ఈ విషయంపై ఆయన్ను అప్రమత్తం చేస్తున్నా.. ఆయన నోట మాత్రం కమీషన్ కాకతీయ అనే మాట పదే పదే వినిపించింది. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ కూడా ఈ తరహాలో ఆవేశంగా మాట్లాడుతూ తడబడ్డారు.

సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఇటీవలే బాబు ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.. హైదరబాద్ పై కేసీఆర్ కి ఎంత హక్కుందో, నాకూ అంతే హక్కుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపైనే కేసీఆర్ మండిపడుతూ.. ‘నీ అబ్బ జాగీరా చంద్రబాబునాయుడూ.. హైదరాబాద్ నీ తాతదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన... ‘ఇయ్యాల హైదరబాదుకు నువ్వు గాదు ముఖ్యమంత్రివి.. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి’ అంటూ పేర్కొన్నారు.

ఇక ఏసీబీ వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాదులో నీ ఏసీబీ వుండదు. హైదరాబాదుపై పోలీస్ జ్యురిష్ డిక్షన్ వుండేది ఆంధ్రప్రదేశ్ డీజీపీకే. నీ డీజీపీకి కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగంలో ఆయన తెలంగాణ డీజీపీ అనాల్సిందిపోయి.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అని అన్నారు. కేసీఆర్ నాలిక ఈ విధంగా మడతబడటంపై అటు ఏపీ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  chandrababu naidu  revanth reddy  

Other Articles