YSJagan, Jagan, YSRCP, Chandrababu, AP

Ysjagan and ysrcongress party leaders celebrating the anniversary of chandrababu naidu

YSJagan, Jagan, YSRCP, Chandrababu, AP

YSjagan and YSRCongress party leaders celebrating the anniversary of Chandrababu naidu. YSjagan and his followers are very happy about the TDP party contraversial issues.

జజ్జనక జనారే అంటున్న జగన్

Posted: 06/09/2015 10:40 AM IST
Ysjagan and ysrcongress party leaders celebrating the anniversary of chandrababu naidu

వైయస్ జగన్ గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడా వల్ల అధికార పీటానికి దూరంగా ఉండిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మెజారిటీతొ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏపిలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా గుంటూరులో మహాసంకల్ప దీక్షను చేపట్టింది. అయితే తాజాగా తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు ఎదురవుతున్న గడ్డుపరిస్థితిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు పాలనాపగ్గాలను చేపట్టి ఏడాది పూర్తైనా సంబరాలు మాత్రం చేసుకోవడం లేదు. కానీ జగన్ వర్గీయులు, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అవును మీరు చదివింది నిజం. ఏడాది పాలనాకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తీన్మార్ వేసుకున్నారు జగన్ వర్గం.ఇంతకీ ఎందుకంత సంబరం అనుకుంటున్నారా..? అయితే స్టోరీ చదవండి.

నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇక అధికర పీటానికి దూరమై.. ప్రతిపక్షపార్టీ స్థానంలో కూర్చున్న జగన్ అండ్ కో మాత్రం చంద్రబాబు మీద సవాళ్లతో దండయాత్ర చేసూనే ఉన్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కోవడంతో జగన్ వర్గం తెగ సంబరపడింది. ఉన్న ఆనందం చాలదన్నట్లు ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆడియో టేపు బయటికి పొక్కడంతో ఆనందం హద్దులు దాటింది. ప్రస్తుతం తమ పార్టీ వ్యవహారాల కన్నాతెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటా అని సమాలోచనలు చేస్తోందట. మొత్తానికి పిల్లికి చలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో మరి..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSJagan  Jagan  YSRCP  Chandrababu  AP  

Other Articles