Harish Rao, Chandrababunaidu, TDP, note for vote scandal, Telangana

Telangana irrigation minister harish rao fire on ap cm chandrababu naidu

Harish Rao, Chandrababunaidu, TDP, note for vote scandal, Telangana

Telangana Irrigation Minister harish Rao fire on ap cm chandrababu naidu. Chandra babunaidu oppose the telangana when central propose the formation of new state.

తప్పదు భారీ మూల్యం: హరీష్ రావ్

Posted: 06/09/2015 08:15 AM IST
Telangana irrigation minister harish rao fire on ap cm chandrababu naidu

సినిమా హాల్లో వస్తున్న కేంద్ర ప్రభుత్వం వారి దూమపానం గురించిన యాడ్ అందరు చూసే ఉంటారు. అందులో దూమపానానికి తప్పదు భారీ మూల్యం అని వస్తుంది. అచ్చం అలాగనే అదే డైలాగ్ చంద్రబాబు విషయంలో వర్తిస్తుందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ అంటున్నారు. అయితే భారీ మూల్యం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ విషయంలో అన్యాయం చేసినందుకు అంటున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నాడని, వాటికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పరోక్షంగా చంద్రబాబుపై ఫైరయ్యారు. అందుకు తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరుపించుకోవాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని, అన్యాయం చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. కుట్రలు చేసి, వాళ్లు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకుండా అడ్డు తగులుతున్నాడని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలు రాకుండా అడ్డుపడిన నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్‌ ఉండదని, నీళ్లు దొరకవని చంద్రబాబు కలలు కన్నారని, కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక్క నిమిషమూ కరెంటు పోకుండా సరఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Rao  Chandrababunaidu  TDP  note for vote scandal  Telangana  

Other Articles