errabelli dayakar rao,revanth reddy,Mind Game

Revanth reddy likely reveal the boss name as errabelli

errabelli dayakar rao,revanth reddy,Mind Game

Revanth Reddy likely reveal the boss name as Errabelli. In the interagation TTDP victim Reventh Reddy said that Errabelli is the boss in the issue of vote for note scandal.

బాస్ చంద్రబాబు కాదు.. ఎర్రబెల్లి..!?

Posted: 06/09/2015 07:32 AM IST
Revanth reddy likely reveal the boss name as errabelli

ఓటుకు నోటు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడుతూ మా బాస్ అన్నీ చూసుకుంటారు అంటూ పదేపదే అనడంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇక్కడ బాస్ అంటే చంద్రబాబేనా..? లేదా ఇంకా ఎవరైనానా..? అన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. అయితే ప్రస్తుతం ఏసీబీ కస్టీబీలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఈ బాస్ ఎవరన్న ఏసీబీ అధికారుల ప్రశ్నకు రేవంత్ ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చినట్లు తెలిసింది.తన బాసు ఎర్రబెల్లి దయాకర్‌రావు అని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావునే తాను బాసు అని పిలుస్తానని, చంద్రబాబును సార్ అంటానని చెప్పినట్లు సమాచారం. రేవంత్ సమాధానంతో ఆశ్చర్యపోయిన ఏసీబీ అధికారులు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ఎర్రబెల్లి పేరు చెప్పినట్టు అనుమానిస్తున్నారు.

రేవంత్ వాగ్మూలం ఆధారంగా ఎర్రబెల్లిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ఏసీబీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. నిజంగా రేవంత్ చెప్పినట్టు ఎర్రబెల్లి బాసైతే వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల డాటాను చేధించాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్ ప్లాన్ లో భాగంగానే ఇలా ఎర్రబెల్లిని మధ్యలోకి లాగుతున్నారని కొంత మంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పేరును కేసు నుండి తొలగించేలా.. చంద్రబాబు ప్రస్తావన రాకుండా చెయ్యాలని తెలుగుదేశం పార్టీ స్కెచ్ వేసిందని అందులో భాగంగానే రేవంత్ చేత కొత్త నాటకం ఆడిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao  revanth reddy  Mind Game  

Other Articles