revanth reddy not cooperate to acb enquiry

Revanth reddy suffering from throat infection and fever lawyers

Revanth reddy, not cooperate, ACB enquiry, note for vote, ACB, ACB interrogation

tdp mla revanth reddy who suffering from throat infection and fever has not cooperated with acb

జ్వరం, గొంతునోప్పితో బాధపడుతూ.. ఏసీబికి సహకరించని రేవంత్..

Posted: 06/07/2015 10:11 PM IST
Revanth reddy suffering from throat infection and fever lawyers

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. అన్ని ప్రశ్నలకు రేవంత్ ఒకటే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ విచారణ ముందుకు సాగడం లేదు. రెండో రోజు రేవంత్ రెడ్డితో పాటు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారులు ప్రశ్నలకు రేవంత్ మౌనం వహించినట్టు తెలుస్తోంది. రేవంత్ కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేశారని ఏసీబీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

అయితే రేవంత్రెడ్డికి తీవ్రమైన గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం ఉన్నాయనీ ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.  దీంతోనే కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సరిగా సమాధానాలు చెప్పలేకపోయారని వారు తెలిపారు. అయితే శనివారం రాత్రి కలుషితమైన నీటిని రేవంత్రెడ్డికి ఇచ్చారన్నారు. అంతేకాక రేవంత్ను కేవలం మంచంపై మాత్రమే పడుకోబెట్టారనీ, పరుపు కూడా ఇవ్వలేదన్నారు.

ఈ విషయంపై తాము ఏసీబీ డీజీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశామని వారు తెలిపారు. అలాగే కాల్ డేటాకు సంబంధించి ఏసీబీ దగ్గర సమాచారముంటే వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలని రేవంత్ చెప్పారన్నారు. డబ్బులతో తనకెలాంటి సంబంధంలేదని ముందునుంచీ ఆయన అదే చెప్తున్నారనీ, ఈ రోజు కూడా అదే చెప్పారనీ రేవంత్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. రెండో రోజు విచారణలో రేవంత్ను డీఎస్పీతోపాటు జేడీ స్థాయి అధికారి విచారించారనీ, మొత్తం 50 నుంచి 60 ప్రశ్నలు అడిగినట్టు న్యాయవాదులు తెలిపారు. అదేవిధంగా సెబాస్టియన్, ఉదయసింహాలకు కూడా అనారోగ్యంగా ఉందని వారి తరపు న్యాయవాదులు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  ACB enquiry  throat infection and fever  

Other Articles