ap, capital, amaravati, chandrababu, child

A child speech attract at a ap capital pooja

ap, capital, amaravati, chandrababu, child

A child speech attract at a ap capital pooja. The chandrababu naidu did pooja in mandagidi for ap capital.

ITEMVIDEOS: అమరావతిని ఎవరూ లాక్కోకూడదు

Posted: 06/06/2015 01:19 PM IST
A child speech attract at a ap capital pooja

ఏపి రాజధాని భూమి పూజ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని భూమి పూజను నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అయితే గతంలో ఎంతో కష్టపడి.. అభివృద్ది చేసిన హైదరాబాద్ కు ఏపి దూరమైంది. మరి కొత్తగా నిర్మిస్తున్న ఏపి రాజధానిని కూడా ఎవరైనా సొంతం చేసుకుంటే.. ? దాన్ని కూడా ఎవరైనా లాక్కుంటే..? ఎంతో కష్టపడి నిర్మించడానికి, చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్న రాజధాని కూడా ఏపికి దక్కకుండా పోతే..? ఇవి ఓ పదేళ్ల చిన్నారికి వచ్చిన డౌట్స్. రాజధాని భూమి పూజ సందర్భంగా అడిగిన ప్రశ్నలు అక్కడికి వచ్చని అందరిని ఆలోచింపచేసింది.

ఏపి రాజధాని భూమి పూజకు తిరుపతి నుండి ఏకంగా స్కేటింగ్ చేసుకుంటూ వచ్చిన ఓ చిన్నారి తను సేవ్ చేసిన డబ్బులను రాజధాని నిర్మాణం కోసం తీసుకువచ్చింది. తిరుపతి నుండి అమరావతి వరకు వచ్చిన ఆ చిన్నారిని చంద్రబాబు ప్రశంసించారు. ఓ చిన్నారి చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని ఆ చిన్నారి కోరారు. అయితే చిన్నారిని మాట్లాడమని చంద్రబాబు కోరగా ఆ చిన్నారి ఒకే నిమిషం మాట్లాడింది. అయితే సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని కోరడమూ కాకుండా.. హైదరాబాద్ లాగా ఎవరూ లాక్కుపోకుండా కాపాడాలని కూడా చిన్నారి చంద్రబాబును కోరింది. దాంతో చంద్రబాబు చాలా ముచ్చట పడ్డారు. సభలో ఉన్న వాళ్లు అంతా ఒక్క నిమిషం పాటు చప్పట్లతో అభినందించారు. మరి నిజంగా అమరావతిని కూడా ఎవరైనా లాక్కుంటారా..? అంటే సమాధానం ఎవరికీ తెలియదు. కానీ అమరావతిని మాత్రం అంతర్జాతీయ స్థాయిలొ నిర్మించడం మాత్రం ఖచ్చితంగా సాధ్యమే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  capital  amaravati  chandrababu  child  

Other Articles