mamata benerjee has reached bangladesh first than Narendra modi | indian politics

Mamata benerjee reach first bangladesh narendra modi indian politics

Mamata Banerjee, Narendra modi, bangladesh tour, modi mamata news, bangladesh updates, india prime minister, west bengal chief minister, narendra modi controversy, mamata benerjee controversy

mamata benerjee reach first bangladesh Narendra modi indian politics : West Bengal chief minister Mamata Banerjee arrived here on Friday, a day ahead of Prime Minister Narendra Modi's two-day maiden visit to Bangladesh.

మోదీని వెనక్కి నెట్టి ‘మమ’ అనిపించిన దీదీ

Posted: 06/06/2015 10:55 AM IST
Mamata benerjee reach first bangladesh narendra modi indian politics

నరేంద్రమోడీ దేశప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి విదేశాల పర్యాటన కొనసాగిస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. అనతికాలంలో ఎక్కువ పర్యటనలు చేసిన ఈయన.. ఆయా దేశాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని దేశ అభివృద్ధిని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన మరో పర్యటన కోసం రంగం సిద్ధం చేసుకోగా.. ఈ వ్యవహారంలో మమతా బెనర్జీ ఎంట్రీ ఇచ్చి అందరికీ ఝలకిచ్చారు. ఈ పర్యటనలో ఆమె మోదీని వెనక్కి నెట్టేసి ముందుకెళ్లడం ఆసక్తికరంగా మారింది.

అసలు విషయం ఏమిటంటే.. మోదీ, దీదీ ఇద్దరూ కలిసి బంగ్లాదేశ్ పర్యటనలో పాల్గొంటారని భావించారు. కానీ.. దీదీ ముందుగానే అక్కడికి వెళ్లడంతో ఈ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. శుక్రవారం రాత్రి ఢాకా విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు.. ఆ దేశ విదేశాంగ మంత్రి షహరియార్ స్వాగతం పలికారు. ఇక తర్వాత బంగ్లాలో అడుగుకు పెట్టిన మోదీకి బంగ్లా ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. మోడీ, దీదీ ఇలా బంగ్లాకి పయనమైన నేపథ్యంలో ఢాకా నగరవ్యాప్తంగా వారిద్దరితోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాందీ, బంగ్లా ప్రధాని హసీనాల నిలువెత్తు కటౌట్లు దర్శనమిస్తున్నాయి.

రెండురోజులపాటు బంగ్లాలో పర్యటించనున్న మోదీ.. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు పెట్టునున్నాయి. కోల్ కతా-ఢాకా-అగర్తల, ఢాకా-షిల్లాంగ్-గౌహతి బస్సు సర్వీసులను మోదీ, హసీనాలు ప్రారంభించారు. ఏదేమైనా.. ఈ పర్యటనలో మోదీకంటే ముందు దీదీ చేరుకోని ‘మమ’ అనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  Narendra Modi  Bangladesh  

Other Articles