ap, capital, pooja, chandrababu, fastival

Ap capital city pooja programme started in fastival mood

ap, capital, pooja, chandrababu, fastival

ap capital city pooja programme started in fastival mood. all ministers and main leaders including ap cm chandrababu naidu and family, attend the capital pooja programmee.

పూజా కార్యక్రమం పండగలా..

Posted: 06/06/2015 08:36 AM IST
Ap capital city pooja programme started in fastival mood

చరిత్రలో నిలిచిపోయేలా.. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించతలపెట్టిన ఏపి రాజధాని నిర్మాణానికి ఈ ఉదయం పూజా కార్యక్రమం ప్రారంభమైంది. పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూమి పూజ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం వద్ద తెల్లవారుజామున 3గంటల నుంచి 9మంది వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహిస్తున్నారు. గణపతి పూజతో రాజధాని పూజా కార్యక్రమం ప్రారంభమైంది. వేద మంత్రాలతో వేద పండితులు పూజా కార్యక్రమాన్ని నిరన్వహిస్తున్నారు.  మానస సరోవర జలాలతో భూమి పూజ ప్రాంగణాన్ని శుద్ధిచేశారు. ఉదయం 8 గంటల 49 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పాల్గొనున్నారు. పూజలను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు ఈ ఉదయం పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి రాజధాని అమరావతికి చేరుకున్నారు. ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నాతాధికారులు భూమి పూజ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  capital  pooja  chandrababu  fastival  

Other Articles