ap, police, tapping, telangana, kcr, hyderabad

Ap police concentrate on telangana police phone tapping issue

ap, police, tapping, telangana, kcr, hyderabad

Ap police concentrate on telangana police phone tapping issue. The police investigating the phone tapping issue in serious. The ap govt decided to put case on te;angana cm kcr if get any strong evedence.

కేసీఆర్ మీద కేసుకు ఏపీ ప్లాన్.?

Posted: 06/06/2015 09:36 AM IST
Ap police concentrate on telangana police phone tapping issue

తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలొ పోటీ పడాలి అనుకున్న తెలుగు వారి కల .. కలాలానే ఉండపోతోందా..? పోటీ అంటే కుట్రలు కుత్రంత్రాలేనా..? అన్నట్లు ప్రస్తుతం తెలంగాణ, ఏపిల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడును దోషిగా నిలబెట్టాలని చూస్తున్న తెలంగాణ సర్కార్ పై ఏపి సర్కార్ గుర్రుగా ఉంది. ఏపి సర్కార్ తాజాగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణలు మా వద్ద ఉన్నాయని ఇప్పటికే ప్రకటించారు.

దాంతో తెలంగాణ పోలీసులు ఎవరెవరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారన్న సమాచారాన్ని సేకరించడంలో ప్రస్తుతం ఏపీ పోలీస్‌ వర్గాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆధారాలు దొరికితే, అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై కేసు నమోదుకు కూడా వెనకాడరాదని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో కొన్నేళ్ల కిందట కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేయడానికి దారితీసిన సమాచారాన్ని కూడా తెప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఏపి, తెలంగాణగా విడిపోయినా కానీ ప్రభుత్వ కార్యకలాపాలాను మాత్రం హైదరాబాద్ నుండే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లను గత కొంత కాలంగా ట్యాపింగ్‌ చేస్తున్నారని ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. అదే సమయంలో, ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లలో ఎవరెవరితో ఏమేం మాట్లాడారో.. ఆ సమాచారమంతా తమ వద్ద ఉందన్న కోణంలో టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలను ఏపీ పోలీస్‌ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌తోపాటు ఆయన చుట్టూ ఉన్నవారు, కొందరు అధికారులు, ఆయనతో సన్నిహితంగా ఉండేవారి ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్న సమాచారం ఏపి పోలీసుల వద్ద ఉంది. దీనిపై ఇప్పటికే డీజీపీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాజీనామా చేసిన వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఏపీ పోలీస్‌ వర్గాలు సేకరిస్తున్నాయి. అప్పట్లో రామకృష్ణ హెగ్డే రాజకీయ ప్రత్యర్థులు ఫోన్లలో మాట్లాడుకొన్న విషయాలు పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. ఆ లీక్‌ వెనక హెగ్డే ఉన్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెప్పించి అధ్యయనం చేయాలని ఏపీ పోలీసులు నిర్ణయించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  police  tapping  telangana  kcr  hyderabad  

Other Articles