Election commission, Ink mark, Ink, Polls

Election commission passed orders to increase the ink mark

Election commission, Ink mark, Ink, Polls

Election commission passed orders to increase the ink mark. Election commisision received complaints about ink marks.

రంగు పడుద్ది.. ముందుకన్నా ఎక్కువ

Posted: 06/04/2015 12:26 PM IST
Election commission passed orders to increase the ink mark

తెలుగు సినిమాలో రంగు పడుద్ది అన్న డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా ఎలక్షన్ కమీషన్ కూడా రంగుపడుద్ది అంటోంది. అవును సాక్షాత్తు భారత ఎన్నికల సంఘం ఈ మాట అంటోంది. అవును ఎందుకు రంగు పడుద్దో మీకు తెలుసా.? ఎన్నికల సమయంలో ఓటు వేసినట్లు గుర్తుగా వేసే ఇంక్ మార్క్ గురించి తాజాగా ఎన్నికల సంఘం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఇంక్ మార్క్ పెద్దగా వెయ్యాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తయారుచేసిన బ్రష్ తో ఇంక్ ను వేలిపై రుద్దాలని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎడమ చేతి చూపుడు వేలిపై బ్రష్ తో ఇంక్ ను గోరు భాగం నుండి మొదటి కీలు కింది దాకా రుద్దాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఎన్నికల నిర్వహణ టైంలో డ్యుటీలో ఉన్న అధికారులు ఇంక్ మార్క్ ను సరిగ్గా పెట్టడంలేదంటూ గత కొంత కాలంగా ఫిర్యాదులు వస్తుండటంతో ఎలక్షన్ కమీషన్ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్రష్ ను ఉపయోగించడం వల్ల ఇంక్ మార్క్ మందంగా, పెద్దగా, స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం బాధ్యతను పర్యవేక్షించే ఎన్నికల అధికారి ఓటు వేయడానికి ముందే ఓటరు వేలిపై ఇంక్ మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు పంపుతారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election commission  Ink mark  Ink  Polls  

Other Articles