A lecturer named Mulgee DhanShetty Allegations on She Team Police | Hyderabad Crime news

Mulgee dhanshetty lecturere allegations she team police

she team, hyderabad she team, Mulgee DhanShetty, lecturer Mulgee DhanShetty, She team crime news, hyderabad rape incidents, hyderabad prostitution, eve teasers

Mulgee DhanShetty Lecturere Allegations She Team Police : A lecturer named Mulgee DhanShetty Allegations on She Team Police. Because some police over action spoiled his lecturer life.

‘షీ టీమ్’ నిర్వాకానికి బలైపోయిన లెక్చరర్

Posted: 06/04/2015 11:35 AM IST
Mulgee dhanshetty lecturere allegations she team police

‘షీ టీమ్’.. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన అరుదైన పథకం. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి.. అత్యాచార ఘటనలు, ఈవ్ టీజింగ్ లు చాలావరకు తగ్గాయి. ఈ టీమ్ వర్గాలు సమర్థవంతంగా తమ పని నిర్వహిస్తూ ఆకతాయిలను ఆకట్టిస్తున్నారు. మహిళలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు ఓ నమ్మకాన్ని ఇస్తున్నారు. ఇటువంటి ఈ ‘షీ టీమ్’ ఓ వ్యవహారంలో కాస్త ఓవర్ గా ప్రవర్తించి.. ఒక లెక్చరర్ జీవితం నాశనం అవడానికి కారణంగా నిలిచింది. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా.. షీ టీమ్ పోలీసులు అనవసరంగా కేసులో ఇరికించారని ఓ అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన మల్గీ ధన్‌శెట్టి అనే వ్యక్తి కొన్నేళ్లుగా పలు కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకునిగా పనిచేశారు. గత జనవరి 12వ తేదీన నాంపల్లి నుంచి కూకట్‌పల్లికి బైక్‌పై ఈయన వెళుతుండగా.. ఫోన్ రావడంతో లక్డీకపూల్ బస్టాప్ సమీపంలో బైక్ ఆపి సెల్‌లో మాట్లాడడం ప్రారంభించారు. ఇక అక్కడే ఉన్న ఓ మహిళ (మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్) తనను లిఫ్ట్ అడిగినట్లు తెలిపారు. ఫోన్‌లో మాట్లాడడం పూర్తయిన తర్వాత ఆమె వద్దకు వెళ్లి.. ‘అమ్మా లిఫ్ట్ అడిగారు కదా వస్తారా’ అని కోరినట్లు తెలిపారు. అదే సమయంలో అక్కడికి మరో కానిస్టేబుల్ వచ్చి.. మహిళలను టీజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన్ను సీసీఎస్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే పోలీసులకు తాను అలాంటి వాడిని కాదని ఎంత చెప్పినప్పటికీ వినలేదని.. చివరికి ఉన్నతాధికారులకు తన వ్యక్తిగత వివరాలు అందించడంతో వాళ్లు వదిలేశారని మల్గీ అన్నారు.

అనంతరం వారంరోజుల తర్వాత సీసీఎస్ పోలీసులు మళ్లీ కాల్ చేసి పీఎస్‌కు రావాలని చెప్పారన్నారు. స్టేషన్‌కు వెళ్లిన తర్వాత తనను నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరపరిచినట్లుగా తెలిపారు. అంతేగాకుండా నేరం ఒప్పుకుని ఫైన్ చెల్లిస్తే కేసు నుంచి బయటపడతావని.. లేకుంటే శిక్ష పడుతుందని బెదిరించారని తెలిపారు. దీంతో ఆయన ఫైన్ చెల్లించినట్లు తెలిపారు. కానీ.. మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుకు సవాల్ చేస్తూ సెషన్ కోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాను చెల్లించిన ఫైన్‌ను రీఫండ్ చేయాలని తీర్పు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. కానీ.. కొందరు పోలీసుల వైఖరి కారణంగా తన అధ్యాపక జీవితం పూర్తిగా నాశనమయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mulgee DhanShetty  She Team  Hyderabad City  

Other Articles