Revanth Reddy, TTDP, jail, Happy

Revanth reddy full happy at jail

Revanth Reddy, TTDP, jail, Happy

Revanth reddy full happy at jail. ACB officals arrest the Revanth Reddy on note for vote scandal. But revanth reddy very happy on TTDP no one position.

రేవంత్ రెడ్డి ఫుల్ హ్యాపీ ఎందుకంటే..

Posted: 06/03/2015 09:56 AM IST
Revanth reddy full happy at jail

అవును రేవంత్ రెడ్డి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నిజం పోలీసులు అరెస్టు చేసినా.. ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేసి కటకటాల వెనక్కి నెట్టినా.. రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదేంటి కష్టాలన్నీ రేవంత్ రెడ్డి దగ్గరికి క్యు కడుతున్నా.. హ్యాపీగా ఎలా ఉంటాడు..? హ్యాపీ కాదు కానీ బాధలో ఉంటారు కదా..? అని అనుకోకండి. రాసిన దాంట్లో ఎలాంటి తప్పూ లేదు. ఎందుకంటే అవి వాస్తవాలు కాబట్టి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వచూపారన్న ఆరోపణలతో సాక్షాలతో సహా ఏసీబీ అధికారులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసింది. కోర్టు ముందు కూడా హాజరు పరిచింది. అయితే కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నా.. మొహం మీద మాత్రం చిరున్వు తగ్గలేదట. పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చిన రేవంత్ రెడ్డి బాగా హుషారుగా కనిపించారు. పార్టీ నేతలను అందరిని చిరునవ్వుతో పలకరించారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ.. ఓటింగ్ టైంలో ఉత్సాహం నింపారు. అయితే రేవంత్ రెడ్డి అంతలా ఖుషీగా ఉండడానికి ఓ కారణం ఉంది. అది ఏంటంటే.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నెంబర్ వన్ పొజిషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రేవంత్ కు ఇక టిటిడిపిలో నెంబర్ వన్ పోస్ట్ కన్ఫార్మ్ అయిందట. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణలను తోసిరాజి తాను తెలంగాణ ప్రాంతంలో నెంబర్ వన్ గా ఎదగడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బాగా పనికి వచ్చాయట. అందుకే జైల్లో ఉన్నా రేవంత్ రెడ్డి ఫుల్ హ్యాపీ గా ఉన్నారు మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  TTDP  jail  Happy  

Other Articles