Janareddy, Politics, Congress, TRS, TDP, Telangana

Will congress senior leader janareddy quit from politics

Janareddy, Politics, Congress, TRS, TDP, Telangana

Will Congress Senior Leader Janareddy quit from Politics. The congress senior leader said that the politics came to wrost stage and political parties doing ugly politics.

రాజకీయాలకు జానారెడ్డి గుడ్ బై.?

Posted: 06/03/2015 08:03 AM IST
Will congress senior leader janareddy quit from politics

కాంగ్రెస్ లో సీనియర్ నేత, తెలంగాణలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డి రాజకీయాల నుండి తప్పుకోనున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాల వల్లో లేదా చాలా కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుండవచ్చు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనమా?ఈ కలుషిత రాజకీయాల్లో తాను కొనసాగాలా?వద్దా? అని ఆలోచిస్తున్నా' అని సిఎల్పీ నేత కె జానారెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై పార్టీ నేతలతోనూ, సన్నిహితులతోనూ చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానన్నారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీతో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటుతో ఘటనతో తాను మనస్థాపం చెందానన్నారు. డబ్బులతో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు టిడిపి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుహ్య ఘటనలు బాధకరమని, వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ గత కొంత కాలంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయాలను కలుషితం చేస్తోందన్నారు. ఇలాంటి రాజకీయాలపై పోరాడాలా? లేక విశ్రాంతి తీసుకోవాలా? అనే అంశాన్ని ఆలోచిస్తానని పునరుద్ఘాటించారు.

టిఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించడం దారుణమన్నారు. నా వారసత్వం పార్టీకే చెందుతుంద న్నారు. ఎవరైనా ప్రమోట్‌ చేయాలనుకుంటే పార్టీ కార్యకర్తలను చేస్తానని ఇతర పార్టీల వారికి ఎందుకు ప్రమోట్‌ చేస్తానన్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలకు తాను సమాధానం చెప్పనన్నారు. తెలంగాణ ప్రజలు ఆశపడ్డ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కోరారు.తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత తెలియజేస్తూ పార్టీ వేడుకలను నిర్వహించిందన్నారు. పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలితను గెలిపించిన పార్టీ ఎమ్మెల్యేలకు జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ నూతన రాష్ట్రంలో నూతన విధానాలతో ముందుకు పోతుందని భావించామన్నారు. కెసిఆర్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే కెసిఆర్‌ దొరకలేదు టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దొరికిపోయారన్నారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర అని ఎద్దేవా చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janareddy  Politics  Congress  TRS  TDP  Telangana  

Other Articles